iQOO Z9 5G : ఇండియాలో ఐకూ జెడ్​9 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!-iqoo z9 5g with dimensity 7200 soc 50mp camera launched in india see price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Z9 5g : ఇండియాలో ఐకూ జెడ్​9 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

iQOO Z9 5G : ఇండియాలో ఐకూ జెడ్​9 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Mar 12, 2024 01:40 PM IST

iQOO Z9 5G price in India : ఐకూ జెడ్​9 5జీ స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐకూ జెడ్​9 5జీ లాంచ్..
ఐకూ జెడ్​9 5జీ లాంచ్..

iQOO Z9 5G price : మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్​సెట్​తో పనిచేసే ఐకూ జెడ్ 9 5జీ స్మార్ట్​ఫోన్​ని రూ.19,999 ప్రారంభ ధరతో భారత్​లో ఆవిష్కరించింది టెక్​ సంస్థ. ఐఐకూ నియో 9 ప్రో లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ గ్యాడ్జెట్​ కూడా బయటకు రావడం విశేషం. ఇక ఈ ఐకూ జెడ్ 9.. ఇటీవలే లాంచ్ అయిన రియల్​మీ 12, రియల్​మీ 12+ లతో పాటు లాంచ్​కు రెడీ అవుతున్న పోకో ఎక్స్ 6 నియో, వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐకూ జెడ్ 9 5జీ ధర..

ఐకూ జెడ్ 9 5జీ స్మార్ట్​ఫోన్​లో​ 8 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపుపై రూ .2,000 ఇన్​స్టంట్​ డిస్కౌంట్​ని కూడా కంపెనీ అందిస్తోంది. ఫలితంగా., ఐక్యూ జెడ్ 9 5జీ ధర వరుసగా రూ .17,999- రూ .19,999 కు దిగొస్తుంది.

iQOO Z9 5G launch date in India : మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ ద్వారా ఐకూ జెడ్9 5జీ అందుబాటులోకి రానుంది.

ఐకూ జెడ్9 5జీ స్పెసిఫికేషన్లు..

ఐకూ జెడ్9 5జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్, 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​కి.. ఐపీ 54 డస్ట్​- స్ప్లాష్​ అసిస్టెంట్ లభిస్తోంది. అంటే.. తేలికపాటి నీరు, వర్షపు చుక్కలు పడినా డ్యామేజ్​ అవ్వదు!

ఐకూ జెడ్ 9 5జీలో.. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం మాలి-జీ610 జీపీయూతో జతచేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్​సెట్ ఉంటుంది. ఐకూ నుంచి లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​లో 8 జీబీ వరకు ఎల్​పీడీడీఆర్​ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యుఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్​ వస్తుంది. ఐకూ జెడ్ 9 5జీ మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు ఎక్స్​ప్యాండెబుల్​ స్టోరేంజ్​ అందిస్తుంది.

iQOO Z9 5G review in Telugu : ఐకూ జెడ్9 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ సెన్సార్, ఓఐఎస్, ఈఐఎస్ సపోర్ట్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.

మరి మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో ఈ ఐకూ జెడ్​9 ఏ మేరకు ప్రదర్శన చేస్తుంది? కస్టమర్లను ఏమేరకు ఆకట్టుకోగలుగుతుంది? అని వేచి చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం