Jio AirFiber Plans: ఈ జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ తో ఆమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ఫ్రీ..
Jio AirFiber Plans: జియో ఎయిర్ ఫైబర్ కొత్త చవకైన ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తో కాంప్లిమెంటరీగా నెట్ ఫ్లిక్స్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లను ఉచితంగా అందిస్తోంది.
Jio AirFiber Plans: నెట్ ఫ్లిక్స్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లను ఉచితంగా అందించే ఎయిర్ ఫైబర్ (Jio AirFiber) ప్లాన్లను జియో ఇంట్రడ్యూస్ చేసింది. ఇకపై వినియోగదారులు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కోసం వేర్వేరుగా చార్జీలు చెల్లించనక్కర లేదు. ఆ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Jio AirFiber ₹1199 Plan: రూ. 1199 ప్లాన్
ఈ నెలవారీ (30 రోజులు) ప్లాన్ తో 100 ఎంబీపీఎస్ (100 Mbps) ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అదనంగా, 550 కి పైగా డిజిటల్ చానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో సినిమాలతో పాటు పలు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ గా లభిస్తాయి.
Jio AirFiber Max ₹1499: రూ. 1499 ప్లాన్
ఈ నెలవారీ (30 రోజులు) ప్లాన్ తో 300 ఎంబీపీఎస్ (300 Mbps) ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అదనంగా, 550 కి పైగా డిజిటల్ చానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ బేసిక్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సోనీ లివ్, జీ 5, జియో సినిమాలతో పాటు పలు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ గా లభిస్తాయి. ప్రస్తుతానికి ఈ సర్వీస్ కొన్ని లొకేషన్లలోనే అందుబాటులో ఉంది.
Jio AirFiber Max ₹2499: రూ. 2499 ప్లాన్
ఈ నెలవారీ (30 రోజులు) ప్లాన్ తో 500 ఎంబీపీఎస్ (500 Mbps) ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అదనంగా, 550 కి పైగా డిజిటల్ చానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ స్టాండర్డ్ (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సోనీ లివ్, జీ 5, జియో సినిమాలతో పాటు పలు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ గా లభిస్తాయి.
Jio AirFiber Max ₹3999: రూ. 3,999 ప్లాన్
సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కావాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ ను జియో ప్రత్యేకంగా రూపొందించింది. 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ తో అత్యంత వేగవంతమైన 1 జీబీపీఎస్ (1 Gbps) ఇంటర్నెట్ లభిస్తుంది. అదనంగా, 550 కి పైగా డిజిటల్ చానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ప్రీమియం (Netflix), డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సోనీ లివ్, జీ 5, జియో సినిమాలతో పాటు పలు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ గా లభిస్తాయి.
Jio AirFiber: ఏ నగరాలలో..
జియో ఎయిర్ ఫైబర్ ప్రస్తుతానికి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 262 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, వైజాగ్, తిరుపతి తదితర నగరాల్లో ఇటీవలనే ఈ సర్వీస్ ను జియో ప్రారంభించింది.