తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto E22s | మోటోరోలా స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్ ధరలోనే, ఫీచర్లు ఇవే!

Moto E22s | మోటోరోలా స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్ ధరలోనే, ఫీచర్లు ఇవే!

HT Telugu Desk HT Telugu

17 October 2022, 14:23 IST

    • మీరు రూ. 10 వేల బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మోటోరోలా లేటెస్ట్‌గా Moto E22s విడుదల చేసింది. దీనిపై పండగ ఆఫర్లు కూడా ఉన్నాయి. దీని ధర, ఫీచర్లపై ఒక లుక్ వేయండి.
Moto E22s
Moto E22s

Moto E22s

మొబైల్ తయారీదారు మోటోరోలా తాజాగా Moto E22s పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌, కాబట్టి అందుబాటు ధరలోనే లభిస్తుంది. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ కొన్ని మెరుగైన ఫీచర్లను అందించారు. ఇందులో భాగంగా మంచి రిఫ్రెష్ రేట్‌ కలిగిన డిస్‌ప్లే, అధిక నాణ్యత గల బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా వంటివి ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Moto E22sలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో పాటు, లాక్ బటన్‌పై ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మౌంట్ అయి ఉంటుంది. స్టొరేజ్ ఆధారంగా ఈ ఫోన్ ఏకైక 64GB వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మైక్రో SD కార్డ్‌తో స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు విస్తరించుకోవచ్చు.

Moto E22s ఫోన్ వెనక ప్యానెల్ పాలికార్బోనేట్‌తో తయారైంది. అందువల్ల ఈ హ్యాండ్‌సెట్ వాటర్ రెసిస్టెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది.

ఇంకా Moto E22sలో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto E22s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD IPS డిస్‌ప్లే
  • 4GB RAM, 64+GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్
  • వెనకవైపు 16MP + 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

కనెక్టివిటీ కోసం, అదనంగా 4gLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS, హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ధర, రూ. 8,999/-

Moto E22s స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ 22 నుండి ఫ్లిప్‌కార్ట్, అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. Flipkart Big Diwali Sale 2022లో ఈ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా పొందగలుగుతారు.

తదుపరి వ్యాసం