Flipkart Big Diwali sale : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​.. మళ్లీ ఆఫర్లే- ఆఫర్లు!-flipkart big diwali sale announced check exiting offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Big Diwali Sale Announced Check Exiting Offers

Flipkart Big Diwali sale : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​.. మళ్లీ ఆఫర్లే- ఆఫర్లు!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2022 02:53 PM IST

Flipkart Big Diwali sale announced : బిగ్​ దివాళీ సేల్​ అంటూ భారతీయుల ముందుకు వస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఈ నెల 11 నుంచి 16 వరకు జరగనున్న సేల్​లో అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​ వచ్చేస్తోంది
ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​ వచ్చేస్తోంది

Flipkart Big Diwali sale announced : పండుగ సేల్స్​తో యూజర్లను ఆకర్షిస్తున్న ఫ్లిప్​కార్ట్​.. మళ్లీ ప్రజల ముందుకొచ్చేస్తోంది! ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​.. ఈ నెల 11న ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు కొనసాగనున్న ఈ సేల్​.. ఫ్లిప్​కార్ట్​ ప్లస్​ మెంబర్స్​కు ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఎస్​బీఐ బ్యాంక్​ కార్డులపై 10శాతం ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను యూజర్లకు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​పై 45శాతం ఆఫర్​ లభిస్తోంది! ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో స్మార్ట్​ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చు. స్క్రీన్​ డ్యామేజ్​ ప్రొటక్షన్​, ఫ్లిప్​కార్ట్​ పే లేటర్​, ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయ.

ఐఫోన్​పై అదిరిపోయే డీల్స్​..!

Flipkart offers on iPhones : ఫ్లిప్​కార్ట్​ అధికారిక వెబ్​సైట్​లో దివాళీ సేల్​ వివరాలు ఉన్నాయి. యాపిల్​ ఐఫోన్​ 13, ఐఫోన్​ 13 మినితో పాటు ఇతర ఐఫోన్​లపై డిస్కౌంట్లు ఉంటాయి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​22+ కూడా భారీ డిస్కౌంట్​ ధరకు(రూ.22000) లభించనుంది. ఇది ఇప్పుడు హాట్​కేక్​లాగా అమ్ముడుపోతోంది. ఇందులో క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ దీని సొంతం.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​లో రియల్​మీ 9ఐ 5జీపైనా ఆకర్షణీయమైన డీల్స్​ ఉన్నాయి. ఒప్పో రెనో 5జీ రూ. 22,000కే అందుబాటులోకి రానుంది. రియల్​మీ 9ప్రో ప్లస్​ 5జీ.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో రూ. 17,000కే దక్కుతుంది. గూగుల్​ పిక్సెల్​ 6ఏ, షియోమీ 11ఐ 5జీ.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​లో రూ. 20వేల వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.

Flipkart Big Diwali sale news : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దివాళీ సేల్​లో ఎలక్ట్రానిక్స్​పై 80శాతం ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్​వాచ్​లు, హెడ్​ఫోన్​లు, వైర్​లెస్​ ఇయర్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​తో పాటు ఇతర పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్​ ఉన్నాయి. ల్యాప్​టాప్​లపై 50శాతం ఆఫ్​ లభించొచ్చు. గేమింగ్​ ల్యాప్​టాప్​లు రూ. 50,900 నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ప్రింటర్​లు, మానిటర్లపై 80శాతం వరకు సేల్​ ఉండనుంది.

పండుగ సీజన్​ను ఫుల్​గా వాడేసుకుంటోంది ఫ్లిప్​కార్ట్​. గత నెల 23న ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​తో ప్రజల ముందుకొచ్చింది. చాలా వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చింది. దసరాకి కూడా మంచి డీల్స్​ ఇచ్చింది. ఇక ఇప్పుడు దివాళీ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది.

Flipkart offers : ఫ్లిప్​కార్ట్​కి పోటీగా.. అమెజాన్​ సైతం ఆఫర్లు, డిస్కౌంట్లు, సేల్స్​ అంటూ హడావుడి చేస్తోంది. మొత్తం మీద.. భారతీయులకు వీటి వల్ల నిజమైన పండుగ సీజన్​ నడుస్తోందనే చెప్పుకోవాలి!

WhatsApp channel

సంబంధిత కథనం