iPhone 14 Pro special edition : ఈ ఐఫోన్ 14 ప్రో ఖరీదు- రూ. 1.1కోట్లు..!
31 October 2022, 20:38 IST
- iPhone 14 Pro special edition : ఈ ఐఫోన్ 14 ప్రో ధర రూ. 1.1కోట్లు! ఇది ఇంత ఖరీదు ఎందుకు ఉందంటే..
ఈ ఐఫోన్ ఖరీదు- రూ. 1.1కోట్లు.. ఎందుకంటే!
iPhone 14 Pro special edition : రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్.. యాపిల్ ఐఫోన్ 14 ప్రో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని విలువ 133,670డాలర్లు. అంటే.. భారత కరెన్సీలో రూ. 1.1కోట్లు! ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఐఫోన్ 14 ప్రో వెనుక భాగంలో రోలెక్స్ వాచ్ ఉంది.
రోలెక్స్ కాస్మాగ్రాఫ్ డేయ్టోనాను గోల్డ్, 8 డైమండ్లతో రూపొందించి.. యాపిల్ ఐఫోన్ 14 ప్రో వెనుక జత చేశారు. మాల్కమ్ క్యాంప్‌బెల్ బ్లూ బర్డ్ సుపర్కార్ స్ఫూర్తితో ఈ ఐఫోన్ 14 ప్రో స్పెషల్ ఎడిషన్‌ను డిజైన్ చేశారు. మొదటి రోలెక్స్ డేయ్టోనా వాచ్‌ను రూపొందించిన వ్యక్తి పేరు మాల్కమ్ క్యాంప్‌బెల్. ఈ వాచ్‌కు మూడు ఎడిషన్లు మాత్రమే ఉన్నాయి.
iPhone 14 Pro Rolex watch : ఇక కేవియర్ వెబ్సైట్లో ఈ ఐఫోన్ 14 ప్రో స్పెషల్ ఎడిషన్ లిస్ట్ అయ్యి ఉంది. 1930 నాటి రేసింగ్ కార్ స్టైల్లో ఈ ఐఫోన్ బాడీని తయారు చేశారు. ఇది తమ బ్రాండ్‌కు చెందిన అత్యంత లెంజడరీ కలెక్షన్లలో ఒకటిగా నిలిచిపోతుందని కంపెనీ పేర్కొంది. రేసింగ్‌కు ఈ స్పెషల్ ఎడిషన్‌ను డెడికేట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
"గోల్డెన్ రోలెక్స్ డేయ్టోనా ఎంతో విలువైన ఆర్ట్. ఇప్పుడు దీనికి యాపిల్ స్మార్ట్‌ఫోన్ తోడైంది. మానవజాతిలో ఎంతో అద్భుతమైనది యాపిల్ స్మార్ట్‌ఫోన్. ఈ రెండు కలవడం ఎంతో సంతోషంగా ఉంది," అని కేవియర్ పేర్కొంది.
ఈ లిమిటెండ్ ఎడిషన్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌కు డెకొరేటివ్ డయల్స్ కూడా ఉన్నాయి. స్పీడోమీటర్, ఆయిల్-ఫ్యూయెల్ ఇండికేటర్లను 18క్యారట్ల గోల్డ్‌తో రూపొందించారు. జ్యువెల్రీ ఎనామెల్‌తో పెయింట్ చేశారు. డాష్‌బోర్డ్ మీద స్విఛ్‌లను కూడా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. కేస్పైన ఉన్న మల్టీ లెవల్ బాడీని బ్లాక్ పీవీడి కోటింగ్‌తో ఉన్న టిటానియంతో రూపొందించారు.
కేవియర్ ప్రాడక్టులకు సహజంగా ఐదంచెల రక్షణతో ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటుంది. వీటికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ 14 ప్రోని ఎవరు దక్కించుకుంటారో చూడాలి!
ఐఫోన్ 14 ప్రో..
iPhone 14 pro : ఐఫోన్ 14 సిరీస్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో బెస్ట్ సెల్లర్‌గా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. భారతదేశంలో Apple iPhone 14 Pro ధర 1,29,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్.. దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి.