తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఐటీసీ షేర్లకు టైమ్​ వచ్చింది! ఈ రూ. 430 స్టాక్​తో భారీ లాభాలు..

Stocks to buy today : ఐటీసీ షేర్లకు టైమ్​ వచ్చింది! ఈ రూ. 430 స్టాక్​తో భారీ లాభాలు..

Sharath Chitturi HT Telugu

10 May 2024, 8:15 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1062 పాయింట్లు పడి 72,404 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 345 పాయింట్లు కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. ఇక 533 పాయింట్ల నష్టంతో బ్యాంక్​ నిఫ్టీ.. 47,488 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో నెగిటివ్​ ట్రెండ్​ కనిపిస్తోంది. ఎలక్షన్​ ఔట్​పుట్​పై వస్తున్న అంచనాలు.. మార్కెట్​లో ప్రతికూలంగా మారాయి. కానీ.. నిఫ్టీ ఓవర్​సోల్డ్​ పొజీషన్​లోకి వెళ్లింది కాబట్టి.. రానున్న ట్రేడింగ్​ సెషన్స్​లో పైకి బౌన్స్​ అయ్యే అవకాశం ఉంది. 21,800- 21,900 లెవల్స్​ దగ్గర నిఫ్టీకి బలమైన సపోర్ట్​ కూడా ఉంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు మరో రూ. 6994.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5642.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today :s గత కొన్ని రోజులుగా ఎఫ్​ఐఐలు ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో విపరీతంగా సెల్​ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే రూ. 22,858 కోట్లు విలువ చేసే షేర్లను అన్​లోడ్​ చేశారు. గత కొన్ని రోజులుగా స్టాక్​ మార్కెట్​ల పతనానికి ఇదీ ఒక కారణం.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Demat Account: మీ డీమ్యాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ సహా అన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా?

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

America Stock market today : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.85శాతం, నాస్​డాక్​ 0.27శాతం మేర లాభపడ్డాయి. ఎస్​ అండ్​ పీ 500 0.51శాతం లాభాల్లో ముగిసింది.

స్టాక్స్​ టు బై..

ఇన్ఫోసిస్​:- బై రూ. 1439.5, స్టాప్​ లాస్​ రూ. 1400, టార్గెట్​ రూ. 1512

సన్​ టీవీ​:- బై రూ. 656.8, స్టాప్​ లాస్​ రూ. 629, టార్గెట్​ రూ. 704

ITC share price target : ఐటీసీ​:- బై రూ. 429, స్టాప్​ లాస్​ రూ. 418, టార్గెట్​ రూ. 440

ఏజిస్​ లాజిస్టిక్స్​​:- బై రూ. 580, స్టాప్​ లాస్​ రూ. 560, టార్గెట్​ రూ. 630

టీవీఎస్ మోటార్​​:- బై రూ. 2065, స్టాప్​ లాస్​ రూ. 2010, టార్గెట్​ రూ. 2150

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం