Nissan Magnite facelift : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్‌కు రెడీ!
19 May 2024, 18:05 IST
- Nissan Magnite facelift launch date : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..
Nissan Magnite facelift launch in India : ఇండియాలో నిస్సాన్‌కు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న మాగ్నైట్ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సిద్ధం చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. భారత రోడ్లపై ఈ మోడల్ టెస్ట్ డ్రైవ్ చేస్తూ పలుమార్లు కనిపించింది. త్వరలోనే ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ ఇంటీరియర్‌లో మార్పులు చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. కొత్త వేరియంట్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్స్ వస్తాయని సమాచారం. అయితే.. ఓవరాల్ డాష్‌బోర్డ్ డిజైన్ కూడా పెద్దగా మారకపోవచ్చు.
Nissan Magnite facelift 2024 : వీటితో పాటు.. ఎగుమతుల కోసం నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ వర్షెన్లను కూడా తయారు చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకే ఈ ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తం మీద.. వార్షికంగా 25వేల నుంచి 30వేల యూనిట్లను సిద్ధం చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోందట.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..
ప్రస్తుతం ఉన్న మోడల్లోని ఇంజిన్ని నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా వాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది.. 72 హెచ్‌పీ పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక టర్బో వర్షెన్ ఇంజిన్.. 100 హెచ్‌పీ పవర్‌ని 160 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే.. అప్డేటెడ్ వర్షెన్లోనూ కొనసాగొచ్చు.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్- ధర ఎంత?
Nissan Magnite facelift price in India : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయిుతే.. ప్రస్తుతం ఉన్న వర్షెన్‌తో పోల్చితే, ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ ధర కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ప్రస్తుతం.. ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షల వద్ద ప్రారంభమవుతుంది.
ఇక.. ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ లాంచ్ ఎప్పుడు? అన్నది సంస్థ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ ఎస్యూవీ 2025 తొలినాళ్లల్లో లాంచ్ అవుతుంది.
ఈ వ్యవహారంపై సంస్థ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
స్కోడా కొత్త ఎస్యూవీ..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు కనిపిస్తున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో స్కోడా సంస్థ కూడా ఉంది. స్కోడా ఆటో ఇండియా.. సరికొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతానికి, కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ పేరు ఖరారు కాలేదు కానీ ఈ వాహనం స్పై షాట్లు ఇంటర్నెట్లో కనిపించడం ప్రారంభించాయి. ఈ స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ టెస్ట్ డ్రైవర్ చేస్తూ.. ఇటీవల భారత రోడ్లపై కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! ఆటోమొబైల్ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.