Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న ఎస్‌యూవీలు ఇవే..!
Upcoming compact SUVs in India : ఇండియాలో పలు ఎస్‌యూవీలు లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. కియా మోటార్స్ నుంచి సిట్రోయెన్ వరకు.. అనేక సంస్థలు.. ఎస్‌యూవీలను రెడీ చేస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Upcoming compact SUVs in India 2024 : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొంది. కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తుండటంతో.. ఆటోమొబైల్ సంస్థలన్నీ.. ఎస్యూవీలపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఇండియాలో ఎస్‌యూవీల జోరుకు ఇప్పట్లో బ్రేక్‌లు పడేడట్టు లేవు. అందుకే.. తమ లైనప్‌లో మరిన్ని ఎస్‌యూవీలను చేర్చేందుకు.. సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో వివిధ ఆటోమొబైల్ సంస్థల నుంచి లాంచ్ అయ్యే ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
స్కోడా..
రానున్న ఎస్‌యూవీల లిస్ట్‌లో స్కోడా ముందుంటుంది! ఈ సంస్థ.. ఎస్‌యూవీలపై చాలా ఫోకస్ చేసింది. స్కోడా కుషాక్ రేంజ్లో మరో ఎస్యూవీ లాంచ్ అవుతుందని సమాచారం. ఈ వెహికిల్‌కి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే చాలాసార్లు జరిగింది. ఇక ఎస్‌యూవీకి పేరు కోసం.. క్విక్, కైమక్, కైలక్, కారిక్, కైరోక్ వంటి పేర్లను సంస్థ పరిశీలిస్తోందట.
ఈ స్కోడా కొత్త ఎస్‌యూవీలో 1.0 లీటర్, 3 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇది.. 115 హెచ్‌పీ పవర్‌ని, 178 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. మేన్యువల్తో పాటు ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.
న్యూ జెన్ హ్యుందాయ్ వెన్యూ..
Best selling SUVs 2024 : హ్యుందాయ్ వెన్యూకు ఇండియాలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో వెన్యూ ఒకటి. దీనిని అప్డేట్ చేసి చాలా కాలమైంది. ఇక ఇప్పుడు.. దీని అప్డేటెడ్ వర్షెన్, లాంచ్‌కు రెడీ అవుతోంది సమాచారం. 2025 తొలినాళ్లల్లోనే ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. 2025 హ్యుందాయ్ వెన్యూలో సరికొత్త డిజైన్‌తో పాటు అనేక కొత్త ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. మెకానిక్స్ పరంగా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు.
కియా క్లావిస్..
ఇండియాలో కియా క్లావిస్ ఎస్యూవీ లాంచ్‌కు రెడీ అవుతుంది. సైరోస్ అనే పేరు ఉన్న ఈ ఎస్యూవీ.. 2025 తొలినాళ్లల్లో ఇది లాంచ్ అవ్వొచ్చు. ఇది.. బెస్ట్ సెల్లింగ్ కియా సోనెట్, కియా సెల్టోస్ మధ్యలో ఉంటుంది.
Kia Clavis launch in India : ఈ కియా క్లావిస్ డిజైన్ స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం. ఇందులో.. ఐసీఈ, హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉంటాయట. ఎలక్ట్రిక్ వర్షెన్.. 2025 రెండో భాగంలో లాంచ్ అవ్వొచ్చు. భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ కన్సోల్, అడాస్‌తో పాటు అనేక ఫీచర్స్ ఉండనున్నాయి.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై చాలా సీరియస్‌గా ఫోకస్ చేసింది కియా. లైనప్‌లో సాలిడ్ వెహికిల్స్‌ని పెట్టి, వాటిని లాంచ్‌కు రెడీ చేస్తోంది.
సిట్రోయెన్..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై ఫోకస్ చేసిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రోయెన్.. ఇప్పటికే సీ5 ఎయిర్‌క్రాస్, సీ3 ఎయిర్‌క్రాస్ మోడల్స్‌ని లాంచ్ చేసింది. సిట్రోయెన్ సీ3కి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు.. మరో కొత్త ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీని పేరు సిట్రోయెన్ బసాల్ట్! ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన టెస్ట్ డ్రైవ్.. భారతీయ రోడ్లపై అనేకసార్లు జరిగింది. ఈ మోడల్.. ఈ జూన్‌లోనే లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం