Mahindra XUV 3XO vs Hyundai Venue : ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ వెన్యూ.. ఏది బెస్ట్?
Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ.. ఏది బెస్ట్? స్పెసిఫికేషన్స్, ధర, ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ లాంచ్‌తో.. భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్నపోటీ మరింత తీవ్రమైంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా అడుగుపెట్టిన ఈ కొత్త ఎస్‌యూవీపై కస్టమర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోందని సమాచారం. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ.. హ్యుందాయ్ వెన్యూకు గట్టి పోటీ ఇస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ: ధర
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ధర రూ .7.49 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. మరోవైపు, హ్యుందాయ్ వెన్యూ ధర రూ .7.94 లక్షల నుంచి రూ .13.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అంటే ఈ రెండు కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఒకదానికొకటి దగ్గరగా, పోటీ ధరతో వస్తాయి. ఏదేమైనా, ఎక్సూవీ 3ఎక్స్ఓ.. వెన్యూ కంటే కొద్దిగా తక్కువ బేస్ ధర కలిగి ఉంది. కానీ వెన్యూ టాప్ ఎండ్ మోడల్ ధర తక్కువ.
ఇదీ చూడండి:- Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ హ్యుందాయ్ వెన్యూ: స్పెసిఫికేషన్..
Mahindra XUV 3XO on road price Hyderabad : కొత్తగా లాంచ్ అయిన మహీంద్రా ఎక్సూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్, ఒక సింగిల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో వస్తోంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్.. 110 బిహెచ్పీ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ యూనిట్.. 128 బీహెచ్పీ పీక్ పవర్, 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్‌తో నడిచే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. డీజిల్ ఎస్యూవీ.. 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ సీఆర్ డీఈ మోటార్ నుంచి పవర్ పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Hyundai Venue on road price Hyderabad : మహీంద్రా ఎస్యూవీ మాదిరిగానే.. హ్యుందాయ్ వెన్యూ కూడా మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్స్ కలిగి ఉంది. అవి.. 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ యూనిట్. ఇందులోని పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 81బీహెచ్పీ పవర్, 113.8ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.. 118బిహెచ్పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 114బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్యూలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 7-స్పీడ్ డిసిటి యూనిట్లు ఉన్నాయి.
సంబంధిత కథనం