తెలుగు న్యూస్  /  బిజినెస్  /  What Is Cruise Control In Car : క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

What is cruise control in car : క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

Sharath Chitturi HT Telugu

10 May 2024, 7:20 IST

    • క్రూజ్​ కంట్రోల్​.. ఈ టెక్నాలజీకి ఈ మధ్య కాలంలో డిమాండ్​ పెరుగుతోంది. అసలు క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..
క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి?
క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి?

క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి?

Cruise control in car : ఇప్పుడు కారు అనేది.. కేవలం ప్రయాణాలకు ఉపయోగించే ఒక సాధానం మాత్రమే కాదు. అంతకు మించి! అధునాత సాంకేతికతపై ఫోకస్​ చేస్తున్న ఆటోమొబైల్​ సంస్థలు.. ఇప్పుడు తమ వాహనాల్లో అనేక ఫీచర్స్​ని ఇస్తున్నాయి. వాటిల్లో క్రూజ్​ కంట్రోల్​ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ క్రూజ్​ కంట్రోల్​కి మంచి డిమాండ్​ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే, వాహనాలు తయారు చేసే సంస్థలు.. మిడ్​ రేంజ్​ వేరియంట్స్​ నుంచే ఈ ఫీచర్​ని అందిస్తున్నాయి. మరి.. అసలు క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ డిటైల్డ్​గా తెలుసుకుందాము..

క్రూజ్​ కంట్రోల్​ అంటే ఏంటి?

క్రూజ్​ కంట్రోల్​ గురించి తెలుసుకునే ముందు.. అడాస్​ గురించి తెలుసుకోవాలి. అడాస్​ (ఏడీఏఎస్​) అంటే.. అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెన్స్​ సిస్టెమ్స్​. ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తోంది. వెహికిల్​ సేఫ్టీకి సంబంధించిన అన్ని ఫీచర్స్​ దీని కిందకి వస్తాయి. క్రూజ్​ కంట్రల్​, క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, పార్క్​ అసిస్ట్​, రేర్​ కొలిజన్​ వార్నింగ్​, సరౌండ్​ వ్యూ, లేన్​ డిపార్చర్​ వార్నింగ్​, ట్రాఫిక్​ సైన్​ రికగ్నీషన్​, ఆటోమెటిక్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​, బ్లైండ్​ స్పాట్​ డిటెక్షన్​ వంటివి కొన్ని అడాస్​ ఫీచర్స్​. హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ సాయంతో ఇవి పనిచేస్తాయి. సెన్సార్​లు, రాడార్​, కెమెరాలు హార్డ్​వేర్​ కిందకి వస్తాయి.

ఈ మధ్య కాలంలో చాలా వాహనాలకు అడాస్​ ఫీచర్ ఉంటోంది. ఇందులో లెవల్ 1, లెవల్​ 2 అని ఉంటాయి. తాజాగా విడుదలైన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఎస్​యూవీలో లెవల్​ 2 అడాస్​ ఫీచర్స్​ని ఇస్తోంది సంస్థ. ఇతర కార్లలో లెవల్​ 1 అడాస్​ ఫీచర్స్​ ఉంటాయి.

Best car with cruise control : ఇక క్రూజ్​ కంట్రోల్​ విషయానికొస్తే.. దీని అర్థం దీని పేరులోనే ఉంది. తగిన స్పీడ్​లో కాన్​స్టెంట్​గా వెళ్లడమే క్రూజ్​ కంట్రోల్​. డ్రైవర్​.. ఒక స్పీడ్​ లిమిట్​ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక యాక్సలరేటర్​ని ప్రెస్​ చేయాల్సిన అవసరం ఉండదు.

క్రూజ్​ కంట్రోల్​లో ఇంకో అడ్వాన్స్​డ్​ ఫీచర్​ కూడా ఉంది. దీని పేరు అడాప్టివ్​ క్రూజ్​కంట్రోల్​. సాధారణ క్రూజ్​ కంట్రోల్​కి అప్డేటెడ్​ వర్షెన్​లా ఉంటుంది ఇది. ఇదొక అడ్వాన్స్​డ్​ ఆటోమేటెడ్​ టెక్నాలజీ. ఇందులో.. ఒకసారి స్పీడ్​ సెట్​ చేస్తే.. వాహనం ఆ స్పీడ్​లో ప్రయాణించడమే కాదు, పరిసర ట్రాఫిక్​కి అనుగుణంగా స్పీడ్​ని అడ్జెస్ట్​ కూడా చేసుకుంటుంది! ఫలితంగా.. సేఫ్టీ మరింత పెరుగుతుంది. ఇది.. ఆటోమెటిక్​ బ్రేకింగ్​ టెక్నాలజీని వాడుకుని.. కారు వేగాన్ని తగ్గిస్తుంది, పెంచుతుంది.

క్రూజ్​ కంట్రోల్​ టెక్నాలజీలో అక్చుయేటర్​ ఉంటుది. ఇది థ్రాటిల్​ ఇన్​పుట్​ని కంట్రోల్​ చేసి, ప్రీ-సెట్​ స్పీడ్​ని మెయిన్​టైన్​ చేస్తుంది. డ్రైవర్​ ఒక స్పీడ్​లో బండిని నడిపినట్టే.. ఇది కూడా పనిచేస్తుంది. ఇక అడాప్టివ్​ క్రూజ్​ కంట్రోల్​లో కూడా ఇదే టెక్నాలజీ ఉంటుందని కానీ.. ఇందులో ఆటోమెటిక్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​ సెటప్​ ఉంటుంది. ట్రాఫిక్​ సమయంలో డ్రైవర్​ యాక్సలేటర్​- బ్రేక్​ని ఎలా వాడతాడో.. ఇది కూడా అలాగే సొంతంగా పనిచేస్తుంది.

How does cruise control work : సాధారణంగా.. క్రూజ్​ కంట్రోల్​ని ఒక బటన్​ ద్వారా యాక్టివేట్​, డీయాక్టివేట్​ చేయవచ్చు. స్టీరింగ్​ వీల్​ మీద ఉండే కన్సోల్​లో క్రూజ్​ కంట్రోల్​ సెట్టింగ్స్​ ఉంటాయి.

తదుపరి వ్యాసం