తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X100s Launch : త్వరలోనే వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Vivo X100s launch : త్వరలోనే వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

10 May 2024, 8:50 IST

  • Vivo X100s price in India : వివో ఎక్స్ 100ఎస్ సిరీస్​తో పాటు వివో ఎక్స్​ 100 అల్ట్రా.. త్వరలోనే లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

త్వరలోనే వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. వివరాలివే!
త్వరలోనే వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. వివరాలివే! (Vivo)

త్వరలోనే వివో ఎక్స్​100 సిరీస్​ లాంచ్​.. వివరాలివే!

Vivo X100s launch date in India : వివో ఎక్స్100ఎస్, ఎక్స్100ఎస్ ప్రో, వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్​ఫోన్స్​ని మే 13న విడుదల చేయనున్నట్లు వివో ప్రకటించింది. లాంచ్​కు ముందు, లీకులు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఈ స్మార్ట్​ఫోన్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

వివో ఎక్స్ 100ఎస్..

చైనా వీబోలో ఇటీవల వచ్చిన లీక్స్​ ప్రకారం.. ఈ మూడు స్మార్ట్​ఫోన్స్​ డిస్​ప్లే, బ్యాటరీ స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వివో ఎక్స్100ఎస్ స్మార్ట్​ఫోన్​లో విజనక్స్ తయారు చేసిన '1.5కే' రిజల్యూషన్​తో కూడిన స్క్రీన్ ఉండనుంది. వివో వీ2 ఇమేజింగ్ చిప్​తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ఎస్​వోసీతో ఈ ఫోన్ పనిచేయనుంది. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగవంతమైన 100వాట్ వైర్డ్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

వివో ఎక్స్ 100ఎస్ ప్రో..

Vivo X100s pro : వివో ఎక్స్ 100ఎస్ ప్రో అదే చిప్​సెట్, స్క్రీన్ రిజల్యూషన్​ను కలిగి ఉంది. అదనంగా, ఇది వీ3 ఇమేజింగ్ చిప్​ని కూడా కలిగి ఉంటుంది. 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 30 వాట్ వయర్​ లెస్ ఛార్జింగ్ రెండింటికీ మద్దతుతో డ్యూయల్ ఛార్జింగ్ ఎంపికను అందిస్తుంది. ఇవన్నీ 5,400 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తాయి.

ఇదీ చూడండి:- Demat Account: మీ డీమ్యాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ సహా అన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా?

వివో ఎక్స్ 100 అల్ట్రా..

మరోవైపు.. కెమెరా-సెంట్రిక్ డివైజ్​గా పిలుస్తున్న వివో ఎక్స్ 100 అల్ట్రాలో స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 చిప్​సెట్, వివో ఇమేజింగ్ చిప్ వీ3+ ఉంటాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూడు జీస్-బ్రాండెడ్ కెమెరాలతో కూడిన విలక్షణమైన వృత్తాకార కెమెరా మాడ్యూల్​ని ప్రదర్శిస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​ లైవ్ ఫొటోలు స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్​తో పాటు ఇతర అధునాతన కెమెరా ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం.

Vivo X100 Ultra price in India : వివో ఎక్స్ 100 అల్ట్రా, ఎక్స్ 100ఎస్, ఎక్స్ 100ఎస్ ప్రో అధికారిక లాంచ్ ఈవెంట్ మే 13న చైనాలో జరగనుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మూడు స్మార్ట్​ఫోన్స్​ ప్రీ-రిజర్వేషన్లు ప్రస్తుతం చైనాలోని వివో ఆన్​లైన్​ స్టోర్స్​లో అందుబాటులో ఉన్నాయి. వివో ఎక్స్ 100 అల్ట్రా వివిధ కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ఉంటాయి. మే 28 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే.. ప్రస్తుతం ఇవి రూమర్స్​ మాత్రమే. లాంచ్​ సమయానికి ఫీచర్స్​పై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. ధరకు సంబంధించిన వివరాలు కూడా అప్డేట్​ అవుతాయి.

తదుపరి వ్యాసం