Vivo Y18 launch : వివో నుంచి రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!
Vivo Y18 price : వివో తన నూతన వివో వై18, వివో వై18ఈ స్మార్ట్ఫోన్లను మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లతో విడుదల చేసింది. వాటి ధరలు, లభ్యత, స్పెసిఫికేషన్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Vivo Y18E price : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వరుస లాంచ్‌లతో వివో సంస్థ మంచి జోరు మీద ఉంది! తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేసింది. అవి.. వివో వై18, వివో వై18ఈ. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌గా వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. డ్యూయెల్ రియర్ కెమెరాలు, విలక్షణమైన వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న ఈ రెండు డివైజ్‌లు.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూఐతో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వై18, వివో వై18ఈ: ధర, లభ్యత
వివో వై18 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999. ఇది జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో వై18ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది.
ఈ రెండు మోడళ్లను వివో ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వివో వై18, వివో వై18ఈ : స్పెసిఫికేషన్లు..
Vivo Y18 features : వివో వై18, వివో వై18ఈ స్పెసిఫికేషన్లు 6.56 ఇంచ్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పిక్సల్ డెన్సిటీ ఉన్నాయి. 12 ఎన్ఎమ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి 85 ఎస్ఓసి, 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఇఎంఎంసీ 5.1 ఇన్-బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లు స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.
ఇదీ చూడండి:- Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్.. ఫీచర్స్ ఇవేనా?
కెమెరా విభాగంలో, వివో వై 18 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు 0.08 మెగాపిక్సెల్ సెన్సార్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. వై18ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
Best Budget friendly smartphones : ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ వివో స్మార్ట్‌ఫోన్స్‌లో 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి ఐపి 54 రేటింగ్‌తో కూడిన వాట్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తున్నాయి.
కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యుఎస్బీ టైప్-సీ ఉన్నాయి. మెజర్మెంట్స్ విషయానికొస్తే.. ఈ రెండు మోడళ్లు 163.63 x 75.58 x 8.39 మిమీ మరియు బరువు 185 గ్రాములు.
సంబంధిత కథనం