తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Electric Cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Sharath Chitturi HT Telugu

20 May 2024, 11:56 IST

google News
    • Upcoming electric cars in India : 2024లో ఇండియాలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ దండయాత్ర కొనసాగనుంది! దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థల నుంచి వరుసగా పలు ఈవీలు లాంచ్​కు రెడీ అవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
ఇండియాలో త్వరలోనే లాంచ్​ కానున్న ఈవీలు ఇవే..
ఇండియాలో త్వరలోనే లాంచ్​ కానున్న ఈవీలు ఇవే..

ఇండియాలో త్వరలోనే లాంచ్​ కానున్న ఈవీలు ఇవే..

Upcoming electric cars 2024 : ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున.. రాబోయే 12 నెలల్లో భారతదేశానికి అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లు లభిస్తాయి. ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను 2024లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం వాహన అమ్మకాలలో ఏడు శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉన్న ఈవీ రంగంలోకి ప్రవేశించడానికి ఈ మోడళ్లలో కొన్ని అగ్రశ్రేణి కార్ల తయారీదారులకు సహాయపడతాయి. మారుతీ సుజుకీ తొలి ఈవీ - ఈవీఎక్స్, టాటా హారియర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లోకి గ్రాండ్​గా అడుగుపెట్టనున్నాయి. వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ కానున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల జాబితాను ఇక్కడ చూడండి.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్..

2024.. మారుతీ సుజుకీకి ఒక మైలురాయి సంవత్సరం. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీఎక్స్​ని ఉత్పత్తిలోకి తీసుకురావాలని యోచిస్తుండటం ఇందుకు కారణం. 2023 ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్​పోలో తొలిసారి ప్రదర్శించిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని హన్సల్​పూర్​లోని సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్ నుంచి తయారు చేయనున్నట్లు కార్ల తయారీ సంస్థ ధృవీకరించింది. ఇది 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందులో 60 కిలోవాట్ల లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది లాంచ్ అయినప్పుడు, ఎంజీ జెడ్ఎస్ ఈవి, హ్యుందాయ్ కోనా వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.

టాటా హారియర్ ఈవీ..

Tata Harrier EV launch in India : మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఒకటి ఈ టాటా హారియర్​ ఈవీ. టాటా మోటార్స్ తన ఫ్లాగ్​షిప్ హారియర్ ఎస్​యూవీలో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెర్షన్​ను తీసుకురానున్నట్లు ధృవీకరించింది. హారియర్ ఈవీ 2023 ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్​పోలో అరంగేట్రం చేసింది. జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్​పై నిర్మించిన హారియర్ ఈవీలో వీ2ఎల్, వీ2వీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. హారియర్ ఈవీని రాబోయే కొన్ని నెలల్లో విడుదల చేయడానికి ముందు స్పాట్ టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ రేంజ్, పెర్ఫార్మెన్స్​, ఫీచర్ల పరంగా ఏం అందిస్తుందనే దాని గురించి చాలా తక్కువ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

టాటా కర్వ్ ఈవీ..

టాటా పంచ్​ ఈవీ ఈ ఏడాది లాంచ్​ అయ్యింది. టాటా హారియర్​ ఈవీ రెడీ అవుతోంది. ఇక టాటా మోటార్స్ నుంచి 2024లో లాంచ్ అయ్యే మూడొవ ఎలక్ట్రిక్ కారు.. కర్వ్ ఈవీ! ఐసీఈ వెర్షన్ అరంగేట్రం చేసిన తర్వాత ఈ టాటా ఎస్​యూవీ ఈవీ వెర్షన్​ను లాంచ్ చేసే అవకాశం ఉంది. కర్వ్ ఈవీ టాటా మోటార్​కి చెందిన ఎక్స్1 ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. నివేదికల ప్రకారం, కర్వ్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఎక్స్​పెక్టెడ్​ రేంజ్​.. 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ ఫేస్​లిఫ్ట్ ఉపయోగించే బ్యాటరీని ఈ కర్వ్ ఈవీలో ఉపయోగిస్తుందో లేదో స్పష్టంగా తెలియదు.

కియా ఈవీ9

Kia EV9 India launch : తన 3 రో ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఈవీ9ను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో తన ఈవీ లైనప్​ను విస్తరించాలని భావిస్తోంది కియా మోటార్స్​. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ (ఈ-జీఎంపీ) ఆధారంగా రూపొందించిన ఈవీ9 ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 541 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఈవీ9 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 9.4 సెకన్లలో అందుకుంటుంది! ఈవీలోని ఆర్​డబ్ల్యూడీ వర్షెన్ మరింత శక్తివంతమైన 160 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్​తో వస్తుంది. ఈవీ 800-వోల్ట్ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్​ను కలిగి ఉంది. ఇది ఈవీ అల్ట్రా-ఫాస్ట్ వేగంతో ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్​తో ఈవీ9 239 కిలోమీటర్లు ప్రయాణించగలదని కియా పేర్కొంది.

మహీంద్రా ఎక్స్​యూవీ.ఈ8

మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్​యూవీ 700 ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్​యూవీని విడుదల చేయడం ద్వారా భారతదేశం కోసం తన ఈవీ లైనప్ ను విస్తరించనుంది. ఎక్స్​యూవీ 400 తర్వాత మహీంద్రాకు ఇది రెండో ఎలక్ట్రిక్ కారు అవుతుంది! మహీంద్రా గత ఏడాది ఆగస్టులో యూకేలో జరిగిన ఒక కార్యక్రమంలో రాబోయే ఐదు ఎలక్ట్రిక్ ఎస్​యూవీలను ప్రదర్శించింది. బోర్న్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద లాంచ్ కానున్న ఎక్స్ యూవీ.ఈ8 డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్​తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో రానుంది. లెవల్ 2 ఏడీఏఎస్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో పాటు ఈ ఎక్స్​యూవీ.ఈ8 ఈవీతో కనీసం 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని మహీంద్రా అందించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం