Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్యూవీ..!
స్కోడా కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన స్పై షాట్స్ లీక్ అయ్యాయి. వాటితో.. కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన పలు కీలక విషయాలు బయటపడ్డాయి. వాటిని ఇక్కడ తెలుసుకోండి..
Skoda new SUV 2024 : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు కనిపిస్తున్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లో స్కోడా సంస్థ కూడా ఉంది. స్కోడా ఆటో ఇండియా.. సరికొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతానికి, కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ పేరు ఖరారు కాలేదు కానీ ఈ వాహనం స్పై షాట్లు ఇంటర్నెట్లో కనిపించడం ప్రారంభించాయి. ఈ స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ టెస్ట్ డ్రైవర్ చేస్తూ.. ఇటీవల భారత రోడ్లపై కనిపించింది.
స్కోడా కొత్త ఎస్యూవీ హైలైట్స్..!
స్పై షాట్స్‌ని చూస్తుంటే.. స్కోడా కొత్త ఎస్యూవీ టెయిల్ ల్యాంప్ డిజైన్ కుషాక్‌ను పోలి ఉంటుందని అనిపిస్తోంది. హెడ్‌ల్యాంప్ సెటప్.. అనేది స్ల్పిట్ యూనిట్, ఇక్కడ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ స్ట్రిప్ పైన ఉంటుంది. మెయిన్ హెడ్‌ల్యాంప్ క్రింద ఉంటుంది. ముందు భాగంలో స్కోడా సిగ్నేచర్ గ్రిల్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో రూఫ్ రైల్స్, అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
ఇందులోని 1.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్.. గరిష్టంగా 113బీహెచ్ పీ పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
Skoda new SUV latest updates : ఈ కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ.. మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యూవీ300, టాటా నెక్సాన్ వంటి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌కి గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం స్కోడా ఇండియాలో కొడియాక్, కుషాక్, స్లావియా, సూపర్బ్ కార్లను విక్రయిస్తోంది. కాబట్టి, రాబోయే ఎస్యూవీ., స్కోడా లైనప్‌లో ఐదొవ మోడల్ అవుతుంది. కుషాక్, స్లావియాలతో తన ప్లాట్‌ఫామ్‌ని పంచుకోనుంది ఈ కొత్త ఎస్యూవీ. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంక్యూబీ-ఏ0-ఐఎన్ అని పిలుస్తారు.
Skoda new SUV : ప్రస్తుతం... స్థానిక సప్లై నెట్వర్క్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది స్కోడా సంస్థ. ఫలితంగా వెహికిల్స్ ధరలు మరింత తగ్గొచ్చు. కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేందుకు స్కోడా ఏర్పాట్లు చేసుకుంటోంది.
స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి సామర్థ్యంలో 30 శాతం పెంపు ఉంటుంది. ఇండియాలోనే దీని డిజైన్, ప్రొడక్షన్ ఉంటుందని సమాచారం. స్కోడా ఆటో ఇండియా.. ఈ కొత్త ఎస్‌యూవీని ఒకే సంవత్సరంలో 1,00,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రెండు సంవత్సరాల వ్యవధిలో కుషాక్, స్లావియా మోడళ్లు సాధించిన సంఖ్యకు రెట్టింపు! అదనంగా, వోక్స్వ్యాగన్ రాబోయే సంవత్సరాల్లో సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ సొంత వెర్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్‌లో అందుబాటులో ఉంది! ఆటోమొబైల్ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
సంబంధిత కథనం