తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Punch EV: సెగ్మెంట్లోనే బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో టాటా పంచ్ ఈవీ..
- టాటా మోటార్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీ. టాటా ఎస్ యూ వీల్లో ఇది రెండో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ. మార్కెట్లో కాంపాక్ట్ ఎస్ యూ వీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో దూసుకుపోతోంది.
- టాటా మోటార్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీ. టాటా ఎస్ యూ వీల్లో ఇది రెండో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ. మార్కెట్లో కాంపాక్ట్ ఎస్ యూ వీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో దూసుకుపోతోంది.
(1 / 10)
టాటా పంచ్ EV టాటా మోటార్స్ నుంచి వచ్చిన నాల్గవ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ కారు. అలాగే, ఇది టాటా మోటార్స్ నుంచి వచ్చిన రెండవ ఆల్-ఎలక్ట్రిక్ SUV.
(2 / 10)
పూర్తిగా కొత్త ప్లాట్ ఫామ్ పై ఈ టాటా పంచ్ ఈవీని రూపొందించారు. ఇదే ప్లాట్ ఫామ్ పై భవిష్యత్తు లో వచ్చే అన్ని టాటా మోటార్స్ ఈవీలురూపొందనున్నాయి.
(3 / 10)
టాటా పంచ్ ఈవీలో డీఆర్ఎల్ లైట్ సిగ్నేచర్, ప్రొజెక్టర్ హెడ్ లైట్, ఫాగ్ ల్యాంప్, బంపర్ అన్నింటినీ పూర్తిగా రీవర్క్ చేశారు.
(4 / 10)
అనేక ఫీచర్ జోడింపులు పంచ్ EVలో చాలా లేటెస్ట్ ఫీచర్స్ ను యాడ్ చేశారు. సెమీ-లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, లేత-రంగు థీమ్.. ఇవన్నీ ఈ కారులోని కొన్ని ముఖ్యాంశాలు.
(5 / 10)
వెలుగులీనే టాటా లోగో ఉన్న స్టీరింగ్ వీల్ డిజైన్ ను నెక్సాన్ నుండి తీసుకున్నారు. అలాగే, సెంటర్ కన్సోల్‌లో జువెల్డ్ డ్రైవ్ డయల్ కూడా ఉంది. ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది.
(6 / 10)
పంచ్ EV లో వెనుక సీట్లో కూర్చొనేవారికి అంత సౌకర్యవంతంగా లేదు. వెనుక సీట్లో కూర్చునేవారికి ఏసీ వెంట్లు లేదా ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా లేవు.
(7 / 10)
పంచ్ EVలో బూట్ స్పేస్ చాలా ఉంది. ఇక్కడ పెద్ద సూట్‌కేస్‌లను ఒకదానిపైన ఒకటి పెట్టవచ్చు. స్పేర్ వీల్ లేకపోవడం వల్ల కూడా స్పేస్ పెరిగింది.
(8 / 10)
టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో వస్తుంది. అవి స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్. 25 kWh బ్యాటరీ ఉన్న కారు రేంజ్ 315 కిమీలు కాగా, 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న కారు రేంజ్ దాదాపు 421 కిమీలు ఉంటుంది.
ఇతర గ్యాలరీలు