Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?-motorola edge 50 ultra receives bis certification likely to debut in india soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?

Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?

Sharath Chitturi HT Telugu
May 05, 2024 06:20 PM IST

Motorola Edge 50 Ultra launch date : మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా.. ఇండియా లాంచ్​కు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఓ కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. పూర్తి వివరాలు..

మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా..
మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా..

Motorola Edge 50 Ultra price in India : మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రాపై గత కొంతకాలంగా బజ్​ నెలకొంది. కానీ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్నది తెలియరాలేదు. కానీ ఇప్పుడు.. ఈ ప్రీమియం స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన ఓ కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. ఎక్స్​టీ 2401-1 మోడల్​ నెంబర్​తో వస్తున్న ఈ ఈ మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా గ్యాడ్జెట్​కి ఇటీవలే బీఐఎస్​ సర్టిఫికేషన్​ లభించింది. ఏదైనా మొబైల్​కి బీఐఎస్​ సర్టిఫికేషన్​ లభిస్తే.. ఆ తర్వాత కొంతకాలానికే అది మార్కెట్​లోకి అడుగుపెడుతుంది.

ఇక.. ఏషియా, యూరోప్​, లాటిన్​ అమెరికా మార్కెట్​లో లాంచ్​ అయిన కొద్దిసేపటికే.. ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాకు బీఐఎస్​ సర్టిఫికేషన్​ ప్రక్రియ పూర్తి అయ్యిందని వార్తలు రావడం స్మార్ట్​ఫోన్​ ప్రియులకు మంచి కిక్​ ఇస్తోంది.

ఎడ్జ్ 50 అల్ట్రా త్వరలో భారత్ లోకి రానుండగా.. ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్​ఫోన్​ గత నెల ప్రారంభం నుంచి దేశంలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు.. ఎడ్జ్​ 50 అల్ట్రాపై ఇప్పటివరకు ఉన్న విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు..

Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా భారతీయ వెర్షన్ గురించి మోటోరోలా సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయనప్పటికీ, ఈ స్మార్ట్​ఫోన్​కి చెందిన యూరోపియన్ వర్షెన్​ని పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తిర విషయాలు అర్థమయ్యాయి. వీటిల్లో చాలా వరకు ఫీచర్స్​.. ఇండియాలో లాంచ్​ అయ్యే గ్యాడ్జెట్​లోనూ కనిపిస్తాయి.

ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 6.7 ఇంచ్​ సూపర్ హెచ్​డీ పీఓఎల్​ఈడీ డిస్ప్లే, 2712×1220 పిక్సెల్స్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​ 2800 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్​నెస్​, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, హెచ్డిఆర్ 10+ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఎడ్జ్ 50 అల్ట్రా ముందు భాగంలో 3డీ కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్​ ఉంటుంది.

ఎడ్జ్ 50 అల్ట్రా ఫ్రేమ్ శాండ్​బ్లాస్టెడ్​ అల్యూమినియంతో తయారు చేసింది సంస్థ. ఈ ఫోన్​కి ఐపి 68 వాటర్​ డస్ట్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​ వస్తోంది.

ప్రాసెసింగ్ పవర్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్​ఫోన్​లో అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం అడ్రినో 735 జీపీయూతో కనెక్ట్​ చేసిన స్నాప్​డ్రాగన్​ 8ఎస్ జెన్ 3 చిప్​సెట్​ ఉంటుది. ఈ ఫోన్ 16 జీబీ వరకు ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో వస్తుంది.

Motorola Edge 50 Ultra release date in India : ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 125 వాట్ వైర్డ్ ఛార్జర్ లేదా 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు.

మరి ఈ గ్యాడ్జెట్​ లాంచ్​ ఎప్పుడు? ధర ఎంత ఉంటుంది? అన్న వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం