Motorola smartphone : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​.. ఫీచర్స్​ ఇవేనా?-motorola teases flagship smartphone with 125w fast charging ahead of launch event here whats coming ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Smartphone : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​.. ఫీచర్స్​ ఇవేనా?

Motorola smartphone : మోటోరోలా నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​.. ఫీచర్స్​ ఇవేనా?

Sharath Chitturi HT Telugu
Apr 13, 2024 01:18 PM IST

Motorola Edge 50 Ultra : సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో మోటోరోలా.. తన లేటెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ని ఏప్రిల్ 16న విడుదల చేయనుంది. ఆ వివరాలు..

మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​..
మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​.. (Motorola)

Motorola Edge 50 Ultra launch date : మోటోరోలా తన తాజా ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్​ని ఈ నెలలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇది 125 వాట్ ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుందని సమాచారం. "ఎడ్జ్ ఫ్యామిలీ"ని ప్రవేశపెట్టడానికి ఏప్రిల్ 16న జరగాల్సిన ఈవెంట్​ని మోటోరోలా సంస్థ అధికారికంగా ధృవీకరించింది. మోటోరోలా ఎడ్జ్ 40 అల్ట్రాలో కనిపించే అదే వేగవంతమైన 125 వాట్ ఛార్జింగ్​ని మోటోరోలా తన రాబోయే ఫ్లాగ్​షిప్​లో కూడా ఇస్తుందని టీజర్​ని చూస్తే స్పష్టమైంది.

మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​ కీలక ఫీచర్లు..

తాజాగా లాంచ్​ అయిన టీజర్​లో.. కనీసం మూడు కెమెరా లెన్స్​లతో కూడిన రియర్ ప్యానెల్​ను ప్రదర్శిస్తూ డిజైన్​పై స్నీక్ పీక్​ను కూడా అందించింది సంస్థ. ఫలితంగా.. అసలు ఈ స్మార్ట్​ఫోన్​ ఏమిటి? అని సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఇది.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అని ఈ నెల ప్రారంభంలో.. ప్రముఖ టిప్​స్టర్​ ఇవాన్ బ్లాస్ సూచించాడు. ఈ డిజైన్ బ్లాస్ వెల్లడించిన విషయాలకు సరిగ్గా సరిపోతుండటం గమనార్హం. మోటోరోలా ఇప్పటికే భారతదేశంలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోను విడుదల చేయగా, "అల్ట్రా" వేరియంట్ ఇంకా అరంగేట్రం చేయలేదు.

Motorola Edge 50 Ultra price : అయితే.. కంపెనీ ఎక్స్ పోస్ట్ ద్వారా మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్ గురించి సంకేతాలను ఇచ్చింది. ఈ ప్రకటన ప్రకారం.. ఎడ్జ్ సిరీస్ హ్యాండ్ సెట్ క్వాల్కమ్ తాజా స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్ఓసితో పనిచేస్తుంది. మోటోరోలా.. ఈ స్మార్ట్​ఫోన్​ పేరును వెల్లడించనప్పటికీ, అల్ట్రా వేరియంట్ ఈ ఎస్​ఓసీని కలిగి ఉండే అవకాశం ఉంది. మునుపటి లీకులు, ఇటీవలి గీక్బెంచ్ బెంచ్​మార్క్​ లిస్టింగ్ కూడా అదే స్నాప్​డ్రాగన్​ 8 సిరీస్ చిప్​సెట్​తో నడుస్తున్న మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా వైపు సూచించాయి.

మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​- ఇతర విశేషాలు..

ఈ వారం ప్రారంభంలో.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గీక్బెంచ్​లో కనిపించింది. ఆకట్టుకునే సింగిల్-కోర్ సీపీయూ స్కోరు 1,947, మల్టీ-కోర్ స్కోరు 5,149. 3.01 గిగాహెర్ట్జ్ గరిష్ట వేగంతో నడిచే హై-పెర్ఫార్మెన్స్ కోర్, 2.80 గిగాహెర్ట్జ్ వద్ద నాలుగు కోర్లు, 2.02 గిగాహెర్ట్జ్ వద్ద మూడు కోర్లు పనిచేస్తాయి. ఈ సీపీయూ కాన్ఫిగరేషన్లు స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్ వోసీకి అనుగుణంగా ఉంటాయి. 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలిపింది.

మునుపటి లీకుల ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్ప్లేను ఇందులో అందించనున్నారు.

Motorola Edge 50 Ultra features : ఎడ్జ్ 50 సిరీస్​లో అత్యంత ప్రీమియం ఆఫర్​గా ఉంటుందని చెబుతున్నా మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ + 2024 లేదా ఎడ్జ్ అల్ట్రా 2024 పేరుతో ఇది యూఎస్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ధర సుమారు $ 999.

మరి ఈ మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​ ఏది? లాంచ్​ ఎప్పుడు? వంటి వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం