Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో సేల్స్​ షురూ- ఫీచర్స్​, ధర చెక్​ చేయండి..-motorola edge 50 pro sale in india begins today check price offers and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో సేల్స్​ షురూ- ఫీచర్స్​, ధర చెక్​ చేయండి..

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో సేల్స్​ షురూ- ఫీచర్స్​, ధర చెక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Apr 09, 2024 02:08 PM IST

Motorola Edge 50 Pro sale date : మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో సేల్​ మొదలైంది. మరి ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర చెక్​ చేశారా? ఇక్కడ చూసేయండి..

మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో ఫీచర్స్​ చెక్​ చేశారా?
మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో ఫీచర్స్​ చెక్​ చేశారా? (Flipkart)

Motorola Edge 50 Pro price in India : ఇండియా మార్కెట్​పై ఫోకస్​ చేసిన దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటోరోలా.. ఇటీవలే కొత్త గ్యాడ్జెట్​ని లాంచ్​ చేసింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్​ఫోన్​ సేల్స్​.. మంగళవారం మొదలయ్యాయి. మోటోరోలా ఎడ్జ్​ 40 ప్రోకి సక్సెసర్​గా వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​లో.. 144 హెర్ట్జ్ డిస్ల్పే, సిలికాన్ వెగాన్ లెదర్ ఫినిష్, ఏఐ ఆధారిత ప్రోగ్రేడ్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్స్​..

మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో.. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ .31999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ .35999గా ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్​తో 68వాట్ ఛార్జర్.. 12 జీబీ ర్యామ్ వేరియంట్​తో​125వాట్ ఛార్జర్​ను మోటోరోలా విడుదల చేసింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో సేల్స్​.. ఈరోజు, ఏప్రిల్​ 9న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్​కార్ట్​, Motorola.in సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్స్​లో సేల్స్​ మొదలయ్యాయి.

ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద.. కొనుగోలుదారులు అదనంగా రూ .2000 తగ్గింపుతో పాటు రూ .2250 వరకు తక్షణ తగ్గింపు లేదా రూ .2000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చని సంస్థ ప్రకటించింది.

Motorola Edge 50 Pro specifications : ఇక మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ పీఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే, 1.5కే రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ వంటివి ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత కొత్త మోటరోలా హలో యూఎక్స్ ఇంటర్​ఫేస్​పై ఈ ఫోన్ పనిచేయనుంది.

Motorola Edge 50 Pro : 50 మెగాపిక్సెల్ ఏఐ ఆధారిత లెన్స్​తో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్​ఫోన్​కు లభిస్తోంది. అడాప్టివ్ వీడియో స్టెబిలైజేషన్ సాధించడానికి మోటో ఏఐని ఈ మోటోరోలా ఎడ్జ్​ 50 ప్రో వాడుతుంది. ఈ మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్​ డిస్ప్లే , కెమెరా వ్యవస్థకు పాంటోన్​ రికగ్నీషన్​ లభిస్తోంది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 125 వాట్ వైర్డ్, 50 వాట్ వైయర్​లెస్​ ఛార్జింగ్ సపోర్ట్​తో పాటు వాటర్​- డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ 68 రేటింగ్​ దీని సొంతం. వస్తుంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్​ కోసమైనా.. మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి.వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ను అనుసరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం