Motorola Android 14 update : ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్స్‌కి మాత్రమే ఆండ్రాయిడ్ 14 అప్డేట్..!
Motorola Android 14 update : అండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అప్టేట్ లభించే స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని విడుదల చేసింది మోటోరోలా. మీ గ్యాడ్జెట్‌కు ఆండ్రాయిడ్ 14 లభిస్తోందా? లేదా? అనేది ఇక్కడ చూడండి.
Motorola Android 14 update : ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చి చాలా రోజులైంది. కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్‌లో ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ లభిస్తోంది. టెక్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోలోని పాత స్మార్ట్‌ఫోన్స్‌కు ఒక్కొక్కటిగా సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇస్తున్నాయి. ఈ విషయంలో సామ్సంగ్ సంస్థ ముందు ఉంది. తన పోర్ట్‌ఫోలియోలోని అనేక గ్యాడ్జెట్స్‌కి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చింది. కానీ మోటోరోలా కస్టమర్లకు.. ఇంతకాలం నిరీక్షణ తప్పలేదు. ఎప్పుడెప్పుడు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ లభిస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ప్రకటన చేసింది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా. ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అప్డేట్ లభించే గ్యాడ్జెట్స్ లిస్ట్‌ని వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
మోటోరోలా ఆండ్రాయిడ్ 14 లిస్ట్..
మోటోరోలా రేజర్ అల్ట్రా, రేజర్+ 2023
మోటోరోలా రేజర్ 40, రేజర్ 2023
మోటోరోలా రేజర్ 2022
Motorola Android 14 : మోటోరోలా ఎడ్జ్+ (2023)
మోటోరోలా ఎడ్జ్ (2023)
మోటోరోలా ఎడ్జ్ (2022)
మోటోరోలా ఎడ్జ్+ 5జీ యూడబ్ల్యూ 2022
మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో
మోటోరోలా ఎడ్జ్ 40 నియో
మోటోరోలా ఎడ్జ్ 40
మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా
మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో/ ఎడ్జ్+ (2022)
మోటోరోలా ఎడ్జ్ 30 నియో
Motorola Android 14 update list : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూషన్
మోటోరోలా ఎడ్జ్ 30
మోటో జీ (2023)
మోటో జీ స్టైలస్ 5జీ (2023)
మోటో జీ స్టైలస్ (2023)
మోటో జీ పవర్ 5జీ
మోటో జీ84
మోటో జీ54
Motorola budget friendly smartphones : మోటో జీ73
మోటో జీ53
మోటో జీ23
మోటో జీ14
మోటోరోలా థింక్‌ఫోన్.
Motorola Android 14 rollout : ఆండ్రాయిడ్ 14 సాఫ్ట్వేర్ అప్డేట్ లభించే స్మార్ట్‌ఫోన్స్ వివరాలను మోటోరోలా ప్రకటించినప్పటికీ.. అవి ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయి? అన్న డేట్‌ని మాత్రం సంస్థ ఇంకా రివీల్ చేయలేదు. అయితే.. మోటో జీ53కి ఆండ్రాయిడ్ 14 అప్డేట్ లభించినట్టు, మోటో జీ54లో అది బీటా టెస్టింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే.. ఇతర గ్యాడ్జెట్స్‌కి కూడా త్వరలోనే కొత్త సాఫ్ట్వేర్ అందుతుందని తెలుస్తోంది.
మరి ఈ లిస్ట్‌లో మీ స్మార్ట్‌ఫోన్ ఉందా? లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ లిస్ట్‌లో త్వరలోనే మరిన్ని స్మార్ట్‌ఫోన్స్‌ను సంస్థ యాడ్ చేసే అవకాశం ఉంది!
సంబంధిత కథనం