Amazon Premier League: ఇది అమెజాన్ ప్రీమియర్ లీగ్.. పాపులర్ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్లు-amazon smartphones premier league deals on oneplus nord ce4 iqoo z9 and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Premier League: ఇది అమెజాన్ ప్రీమియర్ లీగ్.. పాపులర్ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్లు

Amazon Premier League: ఇది అమెజాన్ ప్రీమియర్ లీగ్.. పాపులర్ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్లు

HT Telugu Desk HT Telugu
Apr 06, 2024 09:29 PM IST

అమెజాన్ లో కొత్త సేల్ ప్రారంభమైంది. ప్రస్తుతం క్రికెట్ లో ఐపీఎల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో, ఆమెజాన్ కూడా ఆమెజాన్ స్మార్ట్ ఫోన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మి నార్జో, షియోమీ, హానర్, పోకో, మోటరోలా, ఆపిల్ వంటి టాప్ బ్రాండ్లపై మంచి డీల్స్ ఉన్నాయి.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ (OnePlus)

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారతదేశంలో ఐపీఎల్ క్రికెట్ సీజన్ ను పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్లపై తిరుగులేని ఆఫర్లు, గొప్ప డీల్స్ తో తిరిగి వచ్చింది. అమెజాన్ స్మార్ట్ ఫోన్స్ ప్రీమియర్ లీగ్ సేల్ (Amazon Premier League sale) లో వినియోగదారులు వన్ ప్లస్ (OnePlus), శాంసంగ్ (Samsung), రియల్ మీ నార్జో (realme narzo), షియోమీ (Xiaomi), ఐక్యూ (iQOO), హానర్ (Honor), పోకో (POCO), మోటరోలా (Motorola), ఆపిల్ (Apple) వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ను ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ తో పొందవచ్చు.

డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్

  • వన్ ప్లస్ 12ఆర్ 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 4500 నిట్స్ బ్రైట్నెస్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ తో సహా రూ.38,999కు దీనిని సొంతం చేసుకోవచ్చు.
  • వన్ ప్లస్ నార్డ్ సీఈ4: వన్ ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, 2412 బై 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, స్క్రీన్ టు బాడీ రేషియో 93.40 శాతం, ఫ్లూయిడ్ యానిమేషన్ల కోసం 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వినియోగదారులు Amazon.in లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.24,999 లకే కొనుగోలు చేయవచ్చు.
  • పోకో ఎం6 ప్రో 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్ డిజైన్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ ఏఐ కెమెరా, 6.79 డిస్ ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.9,999 గా ఉంది.
  • రియల్ మి నార్జో 60ఎక్స్ 5జీ: రియల్ మి నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపీ ఏఐ కెమెరా, డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే , 5జీ 6ఎన్ఎం ప్రాసెస్ చిప్ సెట్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. దీని ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
  • శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G): సామ్ సంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్ ఫోన్ లో 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. దీని ధర రూ.11,999 గా నిర్ణయించారు.
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ (Samsung Galaxy S24 5G): శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ప్రీమియం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బెస్ట్ డీల్. ఈ స్మార్ట్ ఫోన్ లో సర్కిల్ టు సెర్చ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఏఐ ఐఎస్పీ, 6.2 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాంక్, కూపన్ ఆఫర్లతో కలిపి దీని ధర రూ.69,999.
  • ఐక్యూ జెడ్9 (iQOO Z9): 1200 హెర్ట్జ్ ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, మోషన్ కంట్రోల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 1800 నిట్స్ బ్రైట్ నెస్ వంటి ఫీచర్ల ఇందులో ఉన్నాయి. అలాగే ఈ ఐక్యూ జెడ్9 స్మార్ట్ ఫోన్ లో సోనీ ఐఎంఎక్స్ 882 ఓఐఎస్ కెమెరా ఉంది. స్లీక్ డిజైన్ తో రూపొందిన ఈ డివైజ్ ను బ్యాంక్ ఆఫర్లతో సహా Amazon.in రూ .17,999 లకు సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసే కస్టమర్లు ఐదు శాతం (ప్రైమ్ కస్టమర్లు), మూడు శాతం (నాన్ ప్రైమ్ మెంబర్స్) క్యాష్ బ్యాక్ తో పాటు ఇతర రివార్డులను పొందవచ్చు. అమెజాన్ పే లేటర్ ద్వారా అర్హులైన కస్టమర్లు రూ.60,000 వరకు పే లేటర్ సదుపాయం పొందవచ్చు.

Whats_app_banner