Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్.. లాంచ్‌కు రెడీ! ఫీచర్స్ ఇవే..
Motorola Edge 50 launch date in India : మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్ ఏప్రిల్ 3, 2024న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోడల్స్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్ గురించి పుకార్లు ఇటీవల రావడం ప్రారంభించాయి. సిరీస్‌లోని స్మార్ట్‌ఫోన్స్‌కి చెందిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెగ వైరల్ అయ్యాయి. టిప్స్టర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గురించి లీక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో.. ఓ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది మోటోరోలా. ఇది.. మోటో ఎడ్జ్ 50 అని టాక్ నడుస్తోంది. రాబోయే మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్ గురించి మేము కొంత సమాచారాన్ని సేకరించాము. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్
మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలను ఏప్రిల్ 3, 2024న విడుదల చేయనుంది టెక్ సంస్ధ. ఈ సిరీలస్వో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే కలిగి ఉంటుందని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా టీజ్ చేసింది సంస్థ. అయితే మోటోరోలా ఎడ్జ్ 50 సిరీస్‌లోని ఏ మోడల్.. ఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుందనే దానిపై స్పష్టత లేదు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్లో ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.
మోటోరోలా కొత్త ఫోన్లు..
Motorola Edge 50 pro price in India : ఇప్పటివరకు ప్రో వెర్షన్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్.. మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బల్లాడ్ బ్లూ, పీకాక్ పింక్, టైడల్ టీల్. ఓ టిప్ స్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రిజొల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో రానుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను ఇందులో ఉండే అవకాశం ఉంది. 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది.
Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. ఎడ్జ్ 30 ఫ్యూజన్‌కి సక్సెసర్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఎడ్జ్ 40 సిరీస్‌లో ఇలాంటి పేరుతో మోడల్‌ను ప్రవేశపెట్టలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ పేరును మోటోరోలా ఇంకా ధృవీకరించలేదు. వీటిపై క్లారిటీ రావాలంటే.. ఏప్రిల్‌లో జరిగే లాంచ్ ఈవెంట వరకు ఎదురుచూడాల్సిందే.
సంబంధిత కథనం