Poco C61: ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లోకి పోకో సీ61; ఏడు వేల లోపే అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్-poco c61 launched in india with 90hz display check features price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco C61: ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లోకి పోకో సీ61; ఏడు వేల లోపే అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్

Poco C61: ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లోకి పోకో సీ61; ఏడు వేల లోపే అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 08:14 PM IST

Poco C61 launch: 90 హెర్ట్జ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో పోకో సీ61 ఇండియాలో లాంచ్ అయింది. ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో భారత్ లో అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లోని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.

పోకో సీ 61 స్మార్ట్ ఫోన్
పోకో సీ 61 స్మార్ట్ ఫోన్ (Poco)

Poco C61 launched in India: తన నూతన స్మార్ట్ ఫోన్ పోకో సీ61ను భారత్ లో విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో మిడ్ రేంజ్ సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుని మరో స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్ 6 నియో (Poco X6 Neo) ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత, లేటెస్ట్ గా పోకో సి 61 ను బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రవేశపెట్టింది.ఈ స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పోకో సీ 61

ప్రీమియం డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో పోకో సీ 61 (Poco C61) తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించామని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ తెలిపారు. పోకో సీ 61 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పోకో సీ61 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

పోకో సీ 61 స్మార్ట్ ఫోన్ లో 6.71 అంగుళాల ఎల్ సీడీ డాట్ డ్రాప్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులోని ప్యానెల్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 హెర్ట్జ్ గరిష్ట బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు తో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంది. 12ఎన్ఎం టెక్నాలజీ ఆధారిత ఆక్టాకోర్ ప్రాసెసర్ మీడియాటెక్ జీ36తో ఇది పనిచేస్తుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ LPDDR4X తో 1 టీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు వెనకవైపు 8 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా, డెప్త్ కంట్రోల్ తో ఏఐ పోర్ట్రెయిట్ మోడ్, ఫిల్మ్ ఫిల్టర్స్, టైమ్డ్ బర్స్ట్, హెచ్డీఆర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. యూఎస్ బీ టైప్-సీ ద్వారా 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు.

పోకో సీ 61 ధర

పోకో సి61 (Poco C61) రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కాగా, మరొకటి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్. మొదటి వేరియంట్ ధర రూ.6,999 కాగా, రెండో వేరియంట్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు. ప్రస్తుం ఈ ఫోన్లపై రూ. 500 కూపన్ తగ్గింపు ఉంది. ఈ పోకో సీ 61 స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లోనూ, పోకో బ్రాండ్ వెబ్ సైట్లలోనూ లభిస్తుంది. ఈ ఫోన్ మిస్టికల్ గ్రీన్, ఎథెరియల్ బ్లూ, డైమండ్ డస్ట్ బ్లాక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

WhatsApp channel