Honor Pad 9 launch: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త హానర్ ప్యాడ్ 9; అందుబాటు ధరలోనే..
Honor Pad 9 launch: భారతీయ వినియోగదారులకు మరో ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది. అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్ తో అందుబాటు ధరలో ప్యాడ్ 9 ను హానర్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో స్నాప్ డ్రాగన్ జెన్ 1 చిప్ సెట్, 35వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 8300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
Honor Pad 9 launch: స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్, 35వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 8300 ఎంఏహెచ్ బ్యాటరీతో హానర్ ప్యాడ్ 9 (Honor Pad 9) భారత్ లో లాంచ్ అయింది. దీనిని భారతదేశంలో మిడ్-రేంజ్ టాబ్లెట్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టారు. ఇది వన్ ప్లస్ ప్యాడ్ గో, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 9 లైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.
మల్టీటాస్కింగ్ కోసం..
నిరంతరం మల్టీటాస్కింగ్ అవసరమయ్యే ప్రొఫెషనల్ అయినా లేదా ప్రయాణంలో సినిమాటిక్ వీక్షణ అనుభవాన్ని కోరుకునే కంటెంట్ ఔత్సాహికులైనా, హానర్ ప్యాడ్ 9 ఆ అవసరాలను తీర్చగలదు. అంచనాలను అధిగమించేలా దీనిని రూపొందించారు.
ధర, ఇతర వివరాలు..
భారతదేశంలో హానర్ ప్యాడ్ 9 (Honor Pad 9) ధర రూ. 24,999 గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్ లో భాగంగా దీనిని రూ.22,999 లకు అందిస్తున్నారు. హానర్ ప్యాడ్ 9 స్లీక్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో వస్తోంది. ఇది 555 గ్రాముల బరువుతో 6.96 మిమీ మందంతో ఉంటుంది. ఇందులో 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 12.1 అంగుళాల డిస్ ప్లేను అమర్చారు. ఇది 249 పిక్సల్స్ పర్ ఇంచ్ (పీపీఐ) వేగంతో క్రిస్ప్ విజువల్స్ ను అందిస్తుంది. దీనిలోని డిస్ ప్లే ప్యానెల్ 500 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ ను సపోర్ట్ చేస్తుంది. హానర్ ప్యాడ్ 9 లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉన్నాయి.
అదిరిపోయే ఆడియో
ఇందులో (Honor Pad 9) అద్భుతమైన సౌండ్ ను ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం హిస్టెన్ సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా మెరుగుపరచిన ఎనిమిది స్పీకర్లను అమర్చారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్, అడ్రినో 710 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పనిచేస్తుంది. హానర్ ప్యాడ్ 9 లో 8 జీబీ LPDDR4X ర్యామ్ తో పాటు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.