Honor Pad 9 : ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న హానర్ ప్యాడ్ 9.. ఫీచర్స్ ఇవే!
Honor Pad 9 India launch : హానర్ 9 ట్యాబ్లెట్.. త్వరలోనే ఇండియాలో లాంచ్కానుంది. ఈ మోడల్ ఫీచర్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Honor Pad 9 launch date in India : ప్యాడ్ 9 గ్యాడ్జెట్‌ని.. గతేడాది డిసెంబర్లో, చైనాలో లాంచ్ చేసింది దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్. ఇక ఇప్పుడు.. ఈ హానర్ ప్యాడ్ 9ని ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ట్యాబ్లెట్‌కి.. ఇటీవలే బీఐఎస్ సర్టిఫికేషన్ లభించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హానర్ ప్యాడ్ 9 ట్యాబ్లెట్ ఫీచర్స్ ఇవే..!
సాధారణంగా.. బీఐఎస్ సర్టిఫికేషన్ లభించిందంటే.. సంబంధిత గ్యాడ్జెట్, ఆ తర్వాతి కొంత కాలానికే లాంచ్ అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే.. హానర్ ప్యాడ్ 9 కూడా త్వరలోనే ఇండియాలోకి అడుగు పెట్టడం ఖాయంగా ఉంది.
బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోడల్ నెంబర్ హెచ్ఈ2- డబ్ల్యూ09. సింగపూర్‌లో కూడా ఇదే మోడల్ నెంబర్ సర్టిఫికేషన్ పొందింది. వాస్తవానికి.. మోడల్ నెంబర్ తప్ప.. హానర్ ప్యాడ్ 9కి చెందిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. కానీ.. చైనాలో ఈ ట్యాబ్లెట్ ఇప్పటికే లాంచ్ అయ్యింది కాబట్టి, ఫీచర్స్ దాదాపు అవే ఉండే అవకాశం ఉంది.
Honor Pad 9 price in India : హానర్ ప్యాడ్ 9 ట్యాబ్లెట్లో 12.1 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. పేపర్ లైక్ డిస్ప్లేకి మాట్ ఫినిషింగ్ ఇచ్చినట్టు సంస్థ చెబుతోంది. 2,560 x 1,600 పిక్సెల్స్ రిసొల్యూషన్ ఇందులో ఉంది. ఎల్సీడీ ప్యానెల్ పీక్ బ్రైట్నెస్ 550 నిట్స్. స్క్రీన్ టు బాడీ రేషియో 88శాతంగా ఉంది. ఈ స్క్రీన్.. రిఫ్లెక్టెడ్ లైట్‌ని 98శాతం ఎలిమినేట్ చేస్తుందని సంస్థ అంటోంది. స్టైలస్, కీబోర్డ్‌తో కూడా ఈ ట్యాబ్లెట్ని ఆపరేట్ చేయవచ్చు.
ఈ హానర్ ప్యాడ్ 9లో 13ఎంపీ రేర్, 8ఎంపీ సెల్ఫీ కెమెరాలు వస్తున్నాయి. ఆడియో కోసం.. ఇందులో 8 స్పీకర్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్లో.. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇందులో ఉంది.
ఈ గ్యాడ్జెట్‌కి 8,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 35వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్ఓఎస్ 7.2 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. చైనాలో.. అజుర్, వైట్, గ్రే కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది.
ఇండియాలో లాంచ్ ఎప్పుడు..?
Honor Pad 9 : చైనాలో ఇప్పటికే.. ఈ హానర్ ప్యాడ్ 9కి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇండియాలో కూడా సేల్స్ బాగా జరుగుతాయని సంస్థ ఆశిస్తోంది. కానీ.. ఈ హానర్ ప్యాడ్ 9 లాంచ్ డేట్‌పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ధరకు సంబంధించిన వివరాలను కూడా చెప్పలేదు. త్వరలోనే వాటిపై ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే.. మేము మీకు తెలియజేస్తాము. అప్పటివరకు స్టే ట్యూన్డ్ టు హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం