తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Ultra Leaks : ఐఫోన్​ 15 అల్ట్రాకు టిటానియం బాడీ..!

iPhone 15 Ultra leaks : ఐఫోన్​ 15 అల్ట్రాకు టిటానియం బాడీ..!

24 October 2022, 11:18 IST

    • iPhone 15 Ultra leaks : ఐఫోన్​ 15 అల్ట్రాకు సంబంధించిన ఓ వార్త లీక్​ అయ్యింది. ఈ వేరియంట్​కు ప్రిమియం టిటానియం బాడీ ఉంటుందని ఆ లీక్​లో ఉంది. ఇదే నిజమైతే, పలు లాభాలు ఉన్నాయి.
ఐఫోన్​ 15 అల్ట్రాకు టిటానియం బాడీ..!
ఐఫోన్​ 15 అల్ట్రాకు టిటానియం బాడీ..!

ఐఫోన్​ 15 అల్ట్రాకు టిటానియం బాడీ..!

iPhone 15 Ultra : ఐఫోన్​ 15పై ఊహాగానాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఒకసారి ఫీచర్స్ అని, ఇంకోసారి డిజైన్​ లీక్​ అయ్యిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బయటకొచ్చిన లీక్​.. ఐఫోన్​ 15 డిజైన్​కి సంబంధించి మరిన్ని వివరాలను చెబుతోంది.

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

ప్రీమియం టిటానియం బాడీ..!

ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ని ఐఫోన్​ 15 అల్ట్రా అని పిలుస్తున్నట్టు తెలుస్తోంది. లీక్స్​యాపిల్​ప్రో అనే టిప్​స్టర్​.. ఈ కొత్త లీక్స్​ను బయటపెట్టాడు. ఈ ఐఫోన్​ 15 అల్ట్రా.. ప్రీమియం టిటానియం బాడీతో వస్తుందని చెప్పాడు. అయితే ఐఫోన్​ 15 ప్రో వేరియంట్​ మాత్రం స్టెయిన్​లెస్​ స్టీల్​ ఉంటుందని అన్నాడు. ఐఫోన్​ 14, 14ప్రోకు కూడా స్టెయిన్​లెస్​ స్టీల్​ బాడీనే ఉంది.

iPhone 15 Ultra leaks : ఐఫోన్​ 14 సిరీస్​కి లాంచ్​కి ముందు కూడా ఇలాంటి ఊహాగానాలే జోరుగా సాగాయి. ఐఫోన్​ 14 ప్రో మోడల్స్​కి ప్రీమియం టిటానియం బాడీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. మరి ఈసారి ఐఫోన్​ 15 అల్ట్రా పరిస్థితేంటో వేచి చూడాలి.

నిజంగానే ఐఫోన్​ 15 అల్ట్రాకి ప్రీమియం టిటానియం బాడీ లభిస్తే.. స్మార్ట్​ఫోన్​ బరువు ఇంకా తగ్గుతుంది. మరింత బలంగా ఉంటుంది. స్క్రాచ్​ రెసిస్టెన్స్​ కూడా పెరుగుతుంది.

మార్కెట్​లో.. టిటానియంతో చేసిన స్మార్ట్​ఫోన్​లు చాలా తక్కువగా ఉన్నాయి. ఐఫోన్​ 15 అల్ట్రాకి ఇది లభిస్తే.. స్మార్ట్​ఫోన్​ మరింత ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా మారుతుంది.

ఇతర రూమర్స్​ ప్రకారం.. ఐఫోన్​ 15 అల్ట్రా వేరియంట్​లో ఫ్రంట్​ కెమెరా సెటప్​ మరింత మెరుగ్గా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. టైప్​-సీ యూఎస్​బీ ఉంటుంది.

ఐఫోన్​ 14..

iPhone 14 plus : సప్లైలో ఇబ్బందులు కారణంగా.. ఐఫోన్​ 14 ప్లస్​ ఉత్పత్తిని తగ్గించేందుకు యాపిల్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. ఒకరు, ఇద్దరు భాగస్వాములకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం.

అయితే.. మార్కెట్​లో దీనిపై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. యాపిల్​ అనుకున్నంత రేంజ్​లో ఐఫోన్​ 14 ప్లస్​కు డిమాండ్​ లేదని, అందుకే ఉత్పత్తిని తగ్గించేస్తోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

తదుపరి వ్యాసం