తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 14 Plus Sale In India : ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ..

iPhone 14 Plus sale in India : ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ..

Sharath Chitturi HT Telugu

07 October 2022, 13:43 IST

    • iPhone 14 Plus sale in India : ఐఫోన్​ 14 ప్లస్​ సేల్​ ఇండియాలో మొదలైంది. లాంచ్​ నేపథ్యంలో ఈ ఫోన్​పై ఆఫర్లు కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ..
ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ..

ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ..

iPhone 14 Plus sale in India : ఇండియాలో ఐఫోన్​ 14 ప్లస్​ సేల్స్​ షురూ! నేటి నుంచి ఈ స్మార్ట్​ఫోన్స్​ను యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు. యాపిల్​ ఇండియా స్టోర్​, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, క్రోమా, యూనిక్రాన్​తో పాటు ఇతర ఆన్​లైన్​, ఆఫలైన్​ స్టోర్స్​లో ఐఫోన్​ 14 ప్లస్​ అందుబాటులోకి వచ్చింది.

ఐఫోన్​ 14 ప్లస్​ ధర.. ఆఫర్లు:-

ఐఫోన్​ 14 ప్లస్​కి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ మూడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బేస్​ మోడల్​ 128జీబీ ధర రూ. 89,900. 256జీబీ వేరియంట్​ ధర రూ. 99,900. 512జీబీ ధర రూ. 1,09,900. రెడ్​, బ్లూ, పర్పుల్​, మిడ్​నైట్​, స్టార్​లైట్​ రంగుల్లో ఈ మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

iPhone 14 plus launch date in India : ఇక ఆఫర్ల విషయానికొస్తే.. లాంచ్​ సందర్బంగా రూ. 7000 ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ను అందిస్తోంది యాపిల్​. అయితే ఇది యాపిల్​ ఆన్​లైన్​ స్టోర్​లో కొంటేనే వర్తిస్తుంది. ఫలితంగా బేస్​ మోడల్​ ధర రూ. 82,900కే లభిస్తుంది. పాత ఐఫోన్​ను ఎక్స్​ఛేంజ్​ చేస్తే.. ఐఫోన్​ 14 ప్లస్​ ధర మరింత తగ్గుతుంది!

ఐఫోన్​ 14 ప్లస్​ ఫీచర్స్​..

iPhone 14 Plus specifications : ఐఫోన్​ 14 బేస్​ మోడల్​కి పెద్ద వర్షెన్​గా ఈ ఐఫోన్​ 14 ప్లస్​ ఉంటుంది. 6.7ఇంచ్​ లిక్విడ్​ రెటినా డిస్​ప్లే ఇందులో ఉంటుంది. ఏ15 బయోనిక్​ చిప్​సెట్​ దీని సొంతం.

ఇక ఆప్టిక్స్​ విషయానికొస్తే.. ఐఫోన్​ 14 ప్లస్​కు 12ఎంపీ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. 12ఎంపీ ట్రూడెప్త్​ కెమెరా విత్​ ఎఫ్​/1.9 అపెర్చర్​ కూడా ఇందులో ఉంది. యాక్షన్​ మోడ్​, సినిమాటిక్​ మోడ్​ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం