తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Apple To Manufacture In India: ఐఫోన్ 14ను ఇండియాలోనే తయారుచేయనున్న ఆపిల్

Apple to manufacture in India: ఐఫోన్ 14ను ఇండియాలోనే తయారుచేయనున్న ఆపిల్

HT Telugu Desk HT Telugu

26 September 2022, 11:37 IST

  • Apple to manufacture in India: ఆపిల్ ఐఫోన్ 14ను ఆ సంస్థ ఇక ఇండియాలో తయారు చేయనుంది.

భారతదేశంలో తయారు కానున్న ఆపిల్ ఐఫోన్ 14
భారతదేశంలో తయారు కానున్న ఆపిల్ ఐఫోన్ 14 ((AP Photo/Jae C. Hong))

భారతదేశంలో తయారు కానున్న ఆపిల్ ఐఫోన్ 14

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్‌లో ఐఫోన్ 14ను తయారు చేయనున్నట్లు తెలిపింది. ‘భారతదేశంలో ఐఫోన్ 14 తయారీకి సంతోషిస్తున్నాం..’ అని ఆపిల్ సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 7న కంపెనీ వార్షిక ఈవెంట్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ భారతదేశంలో సరికొత్త ఐఫోన్ 14 సిరీస్‌ను ఆవిష్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

తాజా ఐఫోన్ 14 సిరీస్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. కొత్త లైనప్‌లో మెరుగైన కెమెరా, శక్తివంతమైన సెన్సార్లు, అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్ టెక్స్ట్‌లను పంపడానికి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను అమర్చారు.

కొత్త ఐఫోన్ 14 చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీ సెంటర్ నుండి రవాణా అవుతుంది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, అలాగే ఐఫోన్ అసెంబ్లర్‌గా ఉంది.

‘కొత్త ఐఫోన్ 14 లైనప్ అద్భుతమైన కొత్త సాంకేతికత, ముఖ్యమైన భద్రతా ఫీచర్లను పరిచయం చేస్తుంది’ అని ఆపిల్ ప్రతినిధి పీటీఐకి చెప్పారు.

జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం ఆపిల్ 14 ఐఫోన్ ఉత్పత్తిలో ఐదు శాతం 2022 చివరి నుండి భారతదేశంలో చేపడతారు. 2025 నాటికి 25 శాతానికి చేరుకుంటుంది. దాదాపు 25 శాతం ఆపిల్ ఉత్పత్తులను 2025 నాటికి చైనా వెలుపల తయారు చేస్తారు.

యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తయారీ కేంద్రాన్ని మార్చేందుకు దారితీశాయని, సప్లై చైన్ కోసం అన్వేషణను ప్రేరేపించాయని నివేదిక పేర్కొంది.

భారతదేశంలో తయారీ వ్యవస్థ విస్తరణ కారణంగా అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ఆపిల్ నిమగ్నమైంది. సెప్టెంబర్ 2020లో భారతదేశంలో తన ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. బెంగళూరులోని యాప్ డిజైన్, డెవలప్‌మెంట్ యాక్సిలరేటర్ కార్యక్రమాలు చేపట్టింది.

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ ‘మేం అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జూన్ త్రైమాసిక రికార్డులను నెలకొల్పాం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా మేం రెండంకెల వృద్ధితో జూన్ త్రైమాసిక ఆదాయ రికార్డులను చూశాం. బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల్లో రెండంకెల వృద్ధి కనిపించింది. భారతదేశంలో దాదాపు రెట్టింపు ఆదాయం లభించింది..’ అని తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం