SBI hikes FD rates : ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ..
13 December 2022, 11:33 IST
- SBI hikes FD rates : ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
SBI hikes FD rates : ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). అయితే ఇవి కొన్ని ఎంపిక చేసిన పథకాలకు మాత్రమే వర్తిస్తాయి. రూ.2కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఎఫ్డీలపై పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. మెచ్యూర్ అవుతున్న డిపాజిట్లను రెన్యూ చేసుకున్నా, కొత్తగా ఎఫ్డీలు తీసుకున్నా.. తాజా వడ్డీ రేట్లు వరిస్తాయి.
"సవరించిన రీటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు 2022 డిసెంబర్ 13 నుంచి అమల్లోకి వస్తాయి," అని ఓ అధికారిక ప్రకటన చేసింది ఎస్బీఐ.
SBI FD interest rates : వడ్డీ రేట్ల పెంపుతో.. 7-45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 3శాతం వడ్డీ లభిస్తోంది. 46-179 రోజుల మధ్య ఎఫ్డీపై 3.9శాతం, 180-210రోజుల మధ్య 5.25శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్డీలపై 5.75శాతం వడ్డీ రేటు వస్తోంది. 1-2ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 6.75శాతం, 2-3మూడేళ్ల వరకు అయితే 6.75శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు- 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వరకు అయితే 6.25శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు వర్తించే నిబంధనలు.
కాగా.. సీనియర్ సిటీజెన్కు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు వేరుగా ఉన్నాయి. 7-45 రోజుల మధ్య ఉండే ఎఫ్డీకి 3.50శాతం వడ్డీ లభిస్తోంది. ఇక 46రోజులు- 179రోజుల వరకు ఉండే ఫిక్స్డ్ డిపాజిట్‌పై 3.50శతం, 46-197రోజుల వరకు ఉండే ఎఫ్డీపై 5శాతం వరకు వడ్డీ ఇస్తోంది ఎస్బీఐ. 180- 210 రోజుల మధ్య అయితే వడ్డీ రేటు 5.75శాతంగాను, 211 రోజుల నుంచి ఏడాది లోపు ముగిసే ఎఫ్డీపై 6.25శాతం, ఏడాది- 2ఏళ్ల వరకు అయితే 7.25శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు అయితే 6.75శాతం, 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వరకు అయితే 7.25శాతం వడ్డీ లభిస్తోంది.
SBI FD interest rates December 2022 : బల్క్ టర్మ్ డిపాజిట్ రేట్లను కూడా పెంచింది ఎస్బీఐ. అన్నింటి మీదా 50-100 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ.. వరుసగా ఐదోసారి..!
RBI rate hike : వరుసగా ఐదోసారి వడ్డీ రేట్లను పెంచుతూ గత బుధవారం నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఈసారి 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు 2022 మే నెల నుంచి వడ్డీ రేట్లను పెంచూతూ వస్తోంది ఆర్బీఐ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.