SBI pensioners: SBI పెన్షనర్లు ఆన్ లైన్లో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఎలా?-how sbi pensioners can submit life certificate through website and mobile app ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How Sbi Pensioners Can Submit Life Certificate Through Website And Mobile App

SBI pensioners: SBI పెన్షనర్లు ఆన్ లైన్లో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం ఎలా?

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 10:43 PM IST

How SBI pensioners can submit life certificate: ఎస్బీఐ నుంచి పెన్షన్ ను డ్రా చేసుకోవాలంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రతీ సంవత్సరం కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్ లైన్ లో ఆ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేసే సదుపాయాన్ని ఎస్బీఐ కల్పించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Reuters)

How SBI pensioners can submit life certificate: పెన్షన్ ను State Bank of India (SBI) నుంచి డ్రా చేసుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ శుభవార్త తెలిపింది. తాము బ్రతికే ఉన్నట్లు నిర్ధారించే లైఫ్ సర్టిఫికెట్ ను వారు ప్రతీ సంవత్సరం నవంబర్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారి వెసులుబాటు కోసం SBIలో కొత్త సదుపాయం అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

How SBI pensioners can submit life certificate: ఆన్ లైన్ లో లైఫ్ సర్టిఫికట్ సబ్మిషన్

పెన్షనర్లు ఇకపై ఆన్ లైన్ లో లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు. వీడియో లైఫ్ సర్టిఫికెట్ సేవను SBI ప్రారంభించింది. ఈ విధానం ద్వారా వారు ఇంట్లో నుంచే తమ లైఫ్ సర్టిఫికెట్(life certificate) లేదా జీవన్ ప్రమాణ్ ను బ్యాంక్ కు సమర్పించవచ్చు. ఇందుకు వారు బ్యాంక్ శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. తాము లేదా తమ కుటుంబ సభ్యుల సహకారంతో వారు ఆన్ లైన్లో లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు.

How SBI pensioners can submit life certificate: మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్

SBI Pension Seva Mobile App లేదా https://www.pensionseva.sbi వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో లైఫ్ సర్టిఫికెట్ ను అందించే అవకాశాన్ని SBI అందిస్తోంది.

How SBI pensioners can submit life certificate: Video Life Certificate ను సబ్మిట్ చేయడం ఎలా?

కింది స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా వీడియో కాల్ తో లైఫ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవచ్చు.

  • SBI Pension Seva Mobile App లేదా https://www.pensionseva.sbi లో కానీ లాగిన్ కావాలి.
  • “Video Life Certificate” బటన్ పై క్లిక్ చేయాలి. వెబ్ సైట్లో పై భాగంలో ఉన్న “VideoLC” లింక్ ను ప్రెస్ చేయాలి.
  • పెన్షన్ క్రెడిట్ అయ్యే అకౌంట్ నెంబర్ ను, కాప్చా(CAPTCHA) ను ఎంటర్ చేయాలి. మొబైల్ యాప్ కు CAPTCHA ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ బాక్స్ ను టిక్ చేసి, వాలిడేట్ అకౌంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేయాలి.
  • అవసరమైన సెల్ఫ్ డిక్లేర్డ్ సర్టిఫికెట్స్ కు సంబంధించిన బాక్స్ లపై టిక్ చేయాలి.
  • అనంతరం, ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయగానే, VLC పేజ్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ ఉన్న సూచనలను చదివి, పర్మిషన్స్ అవసరమైన చోట క్లిక్ చేయాలి.
  • అవసరమైతే, పెన్షనర్ వీడియో కాల్ కోసం వీలైన సమయంలో టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేదా కాసేపు ఎదురు చూడవచ్చు.
  • బ్యాంక్ అధికారి వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అవడానికి కొద్ది సేపు ముందు, డిక్లరేషన్ పేజ్ లోకి వెళ్లి, టర్మ్స్ అండ్ కండిషన్స్ కు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
  • బ్యాంక్ అధికారి వీడియ కాల్ లో కనెక్ట్ అవుతారు. అప్పడు, పెన్షనర్ తన వెరిఫికేషన్ కోడ్ ను ఆ అధికారికి చెప్పాల్సి ఉంటుంది.
  • ఆ తరువాత, తన ప్యాన్ కార్డ్ ను అధికారికి చూపాల్సి ఉంటుంది. ప్యాన్ కార్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత పెన్షనర్ స్పష్టంగా కనిపించేలా కెమెరా వైపు కాసేపు కదలకుండా చూడాలి. అప్పుడు ఆ అధికారి పెన్షనర్ ఫొటో తీసుకుంటాడు.
  • ఈ సమాచారం అంతా రికార్డ్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ తరువాత కాల్ కట్ అవుతుంది.
  • లైఫ్ సర్టిఫికేషన్ ముగిసినట్లుగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు సందేశం వస్తుంది.

IPL_Entry_Point

టాపిక్