తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today Silver Rate 6th June 2023 Check Latest Prices Here

Gold price today : హైదరాబాద్​లో స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

06 June 2023, 5:51 IST

    • Gold price today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్లాటీనం రేట్లు కూడా మారలేదు. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Hindustan Times)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 55,300గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర ఇంతే ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,53,000 వద్ద కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,530గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 60,330గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,03,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,033గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,480గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,330గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,380గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,380గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 73,000గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,000.. బెంగళూరులో రూ. 74,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 26,670గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,670గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)