తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 4, 2024: Ap Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh News Live December 4, 2024: AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

04 December 2024, 22:25 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

04 December 2024, 22:25 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Weather Report : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్, ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

  • AP Weather Report : అరేబియా సముద్రంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 21:17 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nandikotkur School Incident : నందికొట్కూరులో తీవ్ర విషాదం, పాఠశాల గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతి

  • Nandikotkur School Incident : నంద్యాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పాఠశాల గోడ కూలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. కాసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని విగత జీవిగా మారింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 18:44 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

  • AP Free Electricity : ఎస్సీ, ఎస్టీలకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 17:20 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Laddu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఇకపై అడిగినన్ని లడ్డూలు

  • Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ పంపిణీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. అదనంగా రోజుకు 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3500 వడలు తయారీకి టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు పోటు సిబ్బందిని నియమించనుంది.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 16:27 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pushpa 2 Posters : పుష్ప 2 కు రాజకీయ రంగు..! బ్యానర్లపై జగన్ ఫొటోలు, పిఠాపురంలో పోస్ట‌ర్ల చించివేత

  • పుష్ప 2 సినిమాపై రాజకీయం ర‌గడ నెల‌కొంది. పిఠాపురంలో సినిమా పోస్ట‌ర్ల‌ను చించివేసిన ఘటనలు వెలుగు చూశాయి. మ‌రోవైపు అనంత‌పురం జిల్లాలో పుష్ప 2 పోస్టర్లపై జగన్ ఫొటోలు దర్శనమిచ్చాయి.  దీంతో పుష్ప సినిమాకు రాజ‌కీయ రంగు అంటుకున్నట్లు అయింది.
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 15:31 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Konaseema News : కోన‌సీమ జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు, చిన్నారులపై లైంగిక వేధింపులు

  • Konaseema News : కోనసీమ జిల్లాలో దారుణం జరిగింగి. ఓ ప్రభుత్వ పాఠశాలలో 3,4 తరగతుల విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులు ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 15:05 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PIL On Pushpa 2 : విడుదలకు ముందు పుష్ప 2 కు మరో షాక్, టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్

  • PIL On Pushpa 2 : పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లు భారీగా పెంచారని, ఇది చట్ట విరుద్ధమని పిల్ దాఖలైంది. టికెట్ల రేట్ల పెంపుపై కోర్టు కల్పించుకోవాలని కోరారు.

పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 14:41 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila : అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా..? సెకీ ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం - వైఎస్ షర్మిల

  • అదానీ ముడుపుల కేసు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.  తాను పర్సనల్ గా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి కూడా అడుగు బయటపెట్టరంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 13:43 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Dams: రాయలసీమలో భారీ వర్షాలు… తిరుమలలో నిండుకుండల్లా జలాశయాలు.. 270రోజులకు సరిపడా నిల్వలు

  • Tirumala Dams: ఆంధ్రప్రదేశ్‌ను తరచూ పలకరిస్తున్న అల్పపీడనాలు, అకాల వర్షాలతో తిరుమల గిరుల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి.  నిన్న మొన్నటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఓ దశలో తిరుపతి నుంచి తిరుమలకు నీటిని కూడా తరలించాల్సి వస్తుందని భావించినా ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 11:53 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mid Day Meals: ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు మిడ్‌ డే మీల్స్‌, మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలు

  • Mid Day Meals: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరుశాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 10:44 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: BEL Machilipatnam Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్‌ మచిలీపట్నంలో ఇంజనీర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి ఇలా…

  • BEL Machilipatnam Jobs: మచిలీపట్నం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌‌ను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 9:53 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP CID Chief: నిధుల దుర్వినియోగంపై ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు, విజయవాడ వదిలి వెళ్లరాదని ఆంక్షలు

  • AP CID Chief: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై వేటు పడింది. నిధుల మళ్లింపుతో పాటు  అధికార దుర్వినియోగం అభియోగాలపై సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘించినందుకు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 8:05 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Earth Tremors: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

  • AP TG Earth Tremors: తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు వణికించాయి. ఉదయం 7 గంటల నుంచి 7.20 మధ్య ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి. ఖమ్మం,భద్రాద్రి,వరంగల్, కృష్ణాలో  ప్రకంపనలు  కనిపించాయి. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 7:30 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu Residence: వెలగపూడిలో చంద్రబాబు సొంతిల్లు, ఐదు ఎకరాల హౌసింగ్ ఫ్లాట్ కొనుగోలు చేసిన సీఎం

  • Chandrababu Residence: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  నివాస చిరునామా త్వరలో మారనుంది. పదేళ్లుగా విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోర్‌ క్యాపిటల్ ఏరియాలో ప్రస్తుత వెలగపూడి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 7:02 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Polavaram Dues: పోలవరం భూసేకరణ, పునరావాసం బకాయిలు విడుదల, డిసెంబర్‌ రెండో వారంలో చంద్రబాబు పర్యటన

  • Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం  ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది.  2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించింది. 
పూర్తి స్టోరీ చదవండి

04 December 2024, 6:27 IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet: ఏపీలో ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు పొడిగింపు, వాట్సాప్‌లోనే పౌరసేవలు.. ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణ‍యాలు

  • AP Cabinet: ఏపీలో క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మరో రెండేళ్ల గడువు పొడిగించారు. ఆర్జీజీఎస్‌ ద్వారా సులభంగా పౌర సేవల్ని అందించాలని నిర్ణయించారు. క్యాబినెట్‌లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే…
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి