తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Angapradakshinam Tickets Released

TTD Tickets : శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల

HT Telugu Desk HT Telugu

24 March 2023, 10:09 IST

  •  Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.

టీటీడీ
టీటీడీ

టీటీడీ

శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల అయ్యాయి. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ(TTD) టోకెన్లను విడుదల చేస్తారు. గురువారం రోజున స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.5 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. గురువారం 25,113 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

AP TS Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం(Sarva Darshanam) భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 22 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు ఇరవై గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవా టికెట్స్ ఆన్ లైన్ సేవలు కొనసాగించాలని నిర్ణయించారు. వేసవి కాలం మూడు నెలలపాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. వీఐపీ రెఫరల్స్ తగ్గించే అవకాశం ఉంది. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గిస్తామని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి దర్శనం కల్పిస్తామని టీటీడీ అంటోంది.

తిరుమ‌ల(Tirumala) శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు కూడా ఉన్నాయి. జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలి.

టాపిక్