Ugadi Asthanam at Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా 'ఉగాది ఆస్ధానం'-ugadi asthanam held at tirumala temple in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ugadi Asthanam Held At Tirumala Temple In Andhrapradesh

Ugadi Asthanam at Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా 'ఉగాది ఆస్ధానం'

Mar 22, 2023, 07:06 PM IST HT Telugu Desk
Mar 22, 2023, 07:06 PM , IST

Ugadi Asthanam 2023:  శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని.. బుధవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు అర్చకులు పాల్గొన్నారు.

బుధవారం ఉదయం ఏడు నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. 

(1 / 6)

బుధవారం ఉదయం ఏడు నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. (twitter)

పంచాగ శ్రవణం నిర్వహించిన తర్వాత….  ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

(2 / 6)

పంచాగ శ్రవణం నిర్వహించిన తర్వాత….  ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.(twitter)

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైవీ సుబ్బారెడ్డి శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

(3 / 6)

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైవీ సుబ్బారెడ్డి శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. (twitter)

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది. మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను కూడా రద్దు చేసింది. 

(4 / 6)

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది. మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలను కూడా రద్దు చేసింది. (twitter)

ప్రతి ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని  ఇటీవలనే విడుదల చేసింది. తిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు.మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

(5 / 6)

ప్రతి ఏటా లాగానే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని  ఇటీవలనే విడుదల చేసింది. తిరుమలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు.మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.(twitter)

ఎన్నో పంచాంగాలు అందుబాటులో ఉన్నా.. టీటీడీ ముద్రించిన పంచాగాన్ని ఎక్కువ మంది అనుసరిస్తారు.

(6 / 6)

ఎన్నో పంచాంగాలు అందుబాటులో ఉన్నా.. టీటీడీ ముద్రించిన పంచాగాన్ని ఎక్కువ మంది అనుసరిస్తారు.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు