తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

Sarath chandra.B HT Telugu

01 May 2024, 8:28 IST

google News
    • AP Inter Supplementary: ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. గత నెలలో  ఏపీ ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఏప్రిల్ 30తో సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. మే1న కూడా ఫీజు చెల్లించేందుకు అనుమతిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. 
నేడు కూడా ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు....
నేడు కూడా ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు....

నేడు కూడా ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు....

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు, కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ IPASE పరీక్ష ఫీజును మే1న కూడా చెల్లించవచ్చని ప్రకటించింది.

ఇంటర్‌ Advance Supplementary సప్లిమెంటరీ ఫీజు Fee Payment చెల్లింపుకు మొదట ప్రకటించిన గడువును కళాశాలల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గతంలో పొడిగించారు. ఏప్రిల్ 22న ఫలితాలు వెలువడిన వెంటనే రెండు రోజుల్ల సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు ప్రకటించింది. గడువు తక్కువగా ఉండటంతో చివరి తేదీని ఏప్రిల్ 30వరకు పొడిగించారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలతో పాటు సెలవులు కావడంతో పలువురు విద్యార్ధులు ఫీజులు చెల్లించలేదు. కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు కొంత మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదని గడువు పొడిగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి.

విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ లో పరీక్ష ఫీజు చెల్లింపు సమయాన్ని మే 1వరకు పొడిగించారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.

ఇంటర్ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు ఆన్‌లైన్ చెల్లింపు విధానంలో పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా బోర్డు సైట్‌లో ఫీజులు చెల్లించవచ్చు.

కళాశాల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని చివరి అవకాశంగా పరిగణించి, అన్ని రకాల సప్లిమెంటరీ పరీక్ష రుసుమును బుధవారం సాయంత్రం మే 1వ తేదీ 6 PMలోపు ఆన్‌లైన్‌లో చెల్లించవలసిందిగా సూచించారు.

సప్లిమెంటరీ ఫీజు చెల్లింపులు

AP Inter Supplementary Exams 2024: ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఇంటర్‌ విద్యార్థులు సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు కూడా ఈ తేదీల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

ముఖ్య వివరాలు :

రీవెరిఫికేషన్ కోరే విద్యార్థులు - 1300 చెల్లించాలి

రీ కౌంటింగ్ కోరే విద్యార్థులు - 260 చెల్లించాలి.

ఇంప్రూమెంట్ పరీక్షలు రాసే ఆర్ట్స్ విద్యార్థులు - 1240 చెల్లించాలి. సైన్స్ విద్యార్థులు 1440 కట్టాలి.

సప్లిమెంటరీ పరీక్షలు రాసే ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రూ. 1100 చెల్లించాలి. ప్రాక్టికల్స్ ఫీజు రూ. 500గా ఉంది.

HT తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు…

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు(AP Inter Exams 2024) రాసిన ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేయాలి.

లింక్ ఓపెన్ చేయగానే… ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషన్ రిజల్ట్స్ 2024 అనే ఆప్షన్లు కనిపిస్తాయి.

ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-intermediate-1st-year-result-2024

సెకండియర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-board-intermediate-2nd-year-result-2024

ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-inter-first-year-voc-result-2024

ఇంటర్ సెకండియర్ వొకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. https://telugu.hindustantimes.com/voc-board-inter-second-year-voc-result-2024

మీరు పరీక్ష రాసిన లింక్ పై క్లిక్ చేసి మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.

Submit బటన్ పై నొక్కితే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల మెమో కాపీని పొందవచ్చు.

తదుపరి వ్యాసం