తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sajjala Ramakrishna Reddy Comments On On Graduate Mlc Results

Sajjala On MLC Result : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి

HT Telugu Desk HT Telugu

19 March 2023, 18:17 IST

    • Sajjala On MLC Result : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)
సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో) (facebook)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫొటో)

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఆరోపణలు చేశారు. పలువురు అధికారుల తీరు మీద అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు(Chandrababu)కు అలవాటు అని వ్యాఖ్యానించారు సజ్జల. అసెంబ్లీ మీడియా పాయింద్ వద్ద సజ్జల ఈ మేరకు కామెంట్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

AP TS Summer Updates: పగటిపూట బయట తిరగకండి, ముదురుతున్న ఎండలు… వడదెబ్బకు ప్రాణాలు విలవిల

'ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబుది దబాయింపే. చంద్రబాబు హయాంలో వ్యవస్థలను తొక్కిపెట్టారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. త్వరగా అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు ఆశగా ఉన్నారు. ఆయన ఆశలు కలలుగానే మిగులుతాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.' అని సజ్జల అన్నారు.

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్(MLC Election Counting)లో అక్రమాలు జరిగాయని సజ్జల అన్నారు. పలువురు అధికారుల తీరు మీద అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. ఒక్క బండిల్ లోనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయన్నారు. అన్ని బండిల్స్ లోనూ గమనిస్తే.. అసలు విషయం తెలుస్తుందన్నారు. కౌంటింగ్ చేసేప్పుడు అధికారులు ఎలా వ్యవహరించారో చూశామన్నారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారన్నారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత.. అడగాలని ఆర్వో అన్నారని తెలిపారు. రీ కౌంటింగ్(Recounting) చేయాలని కోరడం అభ్యర్థి హక్కు అని సజ్జల పేర్కొన్నారు.

'టీడీపీ వైరస్ లాంటిది. అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుంది. మేం అధికారులపై ఒత్తిడి తెస్తే.. రిజల్ట్ ఇలా ఎందుకు వస్తుంది? మాపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ఎప్పుడూ ధర్మ యుద్ధమే చేస్తుంది.' అని సజ్జల అన్నారు.

శనివారం నాడు ఇదే విషయంపై సజ్జల మాట్లాడారు. పట్టభద్రుల విషయంలో క్షేత్ర స్థాయిలోకి తమ మెసేజ్‌ తీసుకెళ్లడం, ఆ ప్రత్యేక ఓటర్లను రీచ్‌ కావడంలో కొంత ఇబ్బంది జరిగినట్టు ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు మొత్తం సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని తాము అనుకోవడం లేదని... అలా అని దీన్ని తగ్గించాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత గేర్‌ అప్‌ అవుతామని... ఈసారి కమ్యూనిస్టు పార్టీలతో ఎక్కువగా ఉండే పీడీఎఫ్‌ లాంటి వేదికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లను బదిలీ చేశాయని చెప్పారు. వచ్చినవన్నీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కావు అని...వారి అభ్యర్థులు కూడా ఎవరికీ పెద్దగా తెలియదని చెప్పారు. వాళ్ల మధ్య ఉన్న అవగాహన వల్ల అన్ని శక్తులు ఏకమవ్వడంవల్ల తెలుగుదేశం పార్టీ లాభపడి ఉంటుందన్నారు.

2007లో ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ(TDP) గెలిచినా.. 2009 సాధారణ ఎన్నికలపై ప్రభావం పడలేదు కదా..? అని సజ్జల పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుందన్నారు. 2 స్థానాల గెలుపుతోనే శక్తి పెరిగిందని సంబరాలు చేసుకుంటే చేసుకోనివ్వండని వ్యాఖ్యానించారు.