తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Icet Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

Sarath chandra.B HT Telugu

02 May 2024, 13:01 IST

    • AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. మే 2వ తేదీ గురువారం ఉదయం నుంచి హాల్‌ టిక్కెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టి్కెట్ల విడుదల
ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టి్కెట్ల విడుదల

ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టి్కెట్ల విడుదల

AP ICET 2024 : ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల అయ్యాయి.మే 2వ తేదీ గురువారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌ హాల్‌ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. మే 6,7 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఐసెట్ 2024 పరీక్ష జరుగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

ఉదయం సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు, సాయంత్రం సెషన్‌లో మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మే 5వ తేదీ సాయంత్రం ఆరింటికి ఐసెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను మే 10వరకు స్వీకరిస్తారు. జూన్‌ 20 ఫలితాలను వెల్లడిస్తారు.

ఏపీ ఐసెట్‌ హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును ఫాలో అవ్వండి…

ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ గత మార్చిలో విడుదలైంది. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అప్లికేషన్లు(AP ICET Application) స్వీకరించారు.

2024 మే 6, 7 తేదీల్లో రెండు సెషన్లలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.550 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ (AP ICET 2024) అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏపీ ఐసెట్ ‌నిర్వహిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆలస్య రుసుముతో సహా పూర్తైంది.

అర్హులైన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మే 6,7 తేదీల్లో నిర్వహిస్తారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐసెట్ 2024 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తుంది. దీనిలో మూడు వేర్వేరు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. నెటిగివ్ మార్కుల నిబంధన లేదు.

ఆలస్య రుసుము లేకుండా నమోదు ప్రక్రియ ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు ఎడిట్ విండో ఏప్రిల్ 28, 29తేదీల్లో అందుబాటులో ఉంచారు. తాజాగా ఐసెట్‌ హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచారు.

ఏపీ ఐసెట్‌ హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును ఫాలో అవ్వండి…

అభ్యర్థులు మొదట https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న పలు ప్రవేశ పరీక్షల లింకులు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_GetPrintHallTicket.aspx లో హాల్‌ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మే 6,7 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఐసెట్ 2024 పరీక్ష జరుగనుంది.

ఉదయం సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు, సాయంత్రం సెషన్‌లో మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మే 5వ తేదీ సాయంత్రం ఆరింటికి ఐసెట్ 2024 ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను మే 10వరకు స్వీకరిస్తారు. జూన్‌ 20 ఫలితాలను వెల్లడిస్తారు.

తదుపరి వ్యాసం