CBN Complaint: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై చంద్రబాబు ఫిర్యాదు
CBN Complaint: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అక్రమాలపై పదేపదే టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
CBN Complaint: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలు, బోగస్ ఓట్లు, ఎలక్షన్ అధికారుల అధికార దుర్వినియోగంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి 7పేజీల లేఖను రాశారు.
2019 తరువాత తిరుపతిలో జరిగిన పలు ఎన్నికలలో అక్రమాలను సమగ్రం గా వివరిస్తూ లేఖలో ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు జరిగిన ఉల్లంఘనలు కూడా లేఖలో గుర్తు చేశారు.
తిరుపతి ఎన్నికల అక్రమాలను కేస్ స్టడీ గా తీసుకుని స్టడీ చెయ్యాలని...2019 తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి లేఖలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. నాటి ఎన్నికల అక్రమాలపై మా ఫిర్యాదుల ఆధారం గా అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో పాటు అక్రమాలకు ఆధారాలుగా ఉన్న వీడియోలు, డాక్యుమెంట్లు, మీడియా కథనాలు జత చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగాయని, అధికార YSRCP ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందని చంద్రబాబు ఆరోపించారు.
గత ఎన్నికల్లో వైసీపీ చేసిన బోగస్ ఓట్ల నమోదు, ప్రత్యర్థి అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, బూత్ క్యాప్చర్, రిగ్గింగ్ పై ఫిర్యాదులు చేశామని, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కి 2021 మార్చి 10 న జరిగిన ఎన్నికల్లో అధికార YSRCP, ఎన్నికల అధికారులతో కలిసి చేసిన అవకతవకలపై నాడే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకగ్రీవాలు అయ్యాయని వివరించారు. ఏకగ్రీవాలకు అధికార పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగం కారణమని నాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కేంద్రానికి లేఖ
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు, సహా పలు చట్టవిరుద్ధమైన ఘటనలకు అధికార వైసీపీ నేతలు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తిరుపతి పట్టణంలో అధికార వైఎస్సార్‌సీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులతో కుమ్మక్కై అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. తిరుపతి పట్టణాన్ని కేస్ స్టడీగా తీసుకుని అధికార పార్టీ అక్రమాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
టాపిక్