తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Ooty Tour: అతి తక్కువ ధరలో ఊటీ ట్రిప్... ఛాన్స్ ఈ నెల వరకు మాత్రమే

IRCTC Ooty Tour: అతి తక్కువ ధరలో ఊటీ ట్రిప్... ఛాన్స్ ఈ నెల వరకు మాత్రమే

HT Telugu Desk HT Telugu

04 March 2023, 10:07 IST

    • IRCTC Ooty Tour Package Latest: సమ్మర్ లో ఊటీకి వెళ్లాలని ఉందా? అయితే మీకు ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. తేదీలతో పాటు ధరలు, చూసే ప్రాంతాల వివరాలను ప్రకటించింది.
తిరుపతి - ఊటీ ట్రిప్
తిరుపతి - ఊటీ ట్రిప్ (facebook)

తిరుపతి - ఊటీ ట్రిప్

IRCTC Tourism Tirupati Ooty Package: సమ్మర్ వచ్చేసింది...! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం చూస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఊటీ వెళ్లే వారికోసం సూపర్ ప్యాకేజీ తీసుకువచ్చింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యే... ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Tirupati Ooty Tour Schedule: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి 14వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. ఆరు రోజుల ప్లాన్ ఎలా ఉంటుందో చూస్తే....

Day - 01 Tuesday: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.55 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day - 02 Wednesday: ఉదయం 8.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 03 Thursday: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.

Day - 04 Friday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day - 05 Saturday: హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.

Day - 06 Sunday: రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు..

టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 25910 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 14030 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11040గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక స్టాండర్ట్ క్లాస్ లో తక్కువ ధరలు ఉన్నాయి. అయితే ఏప్రిల్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ధరలు మరింత పెరగనున్నాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

ఊటీ ట్రిప్ ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.