తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Kashmir Tour : వైజాగ్ నుంచి కశ్మీర్ ట్రిప్...ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

IRCTC Kashmir Tour : వైజాగ్ నుంచి కశ్మీర్ ట్రిప్...ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu

12 February 2023, 9:49 IST

google News
    • IRCTC Tourism Latest Packages: భూతల స్వర్గం కశ్మీర్ ను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. మంచు కొండల్లో హాయిగా గడపాలని చాలా మంది అనుకుంటారు. ఓవైపు సెలయేళ్లు, మరోవైపు ఎత్తుగా ఉండే వ్యాలీలు చూసేందుకు ఎవరైనా ఇష్టపడుతారు. అయితే అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన డేట్స్, ధరల వివరాలను కూడా పేర్కొంది.
వైజాగ్ - కశ్మీర్ టూర్
వైజాగ్ - కశ్మీర్ టూర్ (/www.irctctourism.com/)

వైజాగ్ - కశ్మీర్ టూర్

IRCTC Tourism Kashmir Tour: కశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? ఎంతో అందమైన కశ్మీర్ ప్రకృతి అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ నుంచి సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. "KASHMIR - HEAVEN ON EARTH EX VISHAKAPATNAM (SCBA24)" అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూ, కశ్మీర్‌లోని అందమైన కొండలు, గుల్‌మార్గ్‌లోని మనోహరమైన పచ్చికభూములు, సోన్‌మార్గ్‌లోని హిమానీనదాలు, పహల్‌ఘమ్‌లోని అద్భుతమైన లోయతో శ్రీనగర్ ప్రకృతిని చూడొచ్చు.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 24వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే....

Day 1 : విశాఖపట్నం విమానాశ్రయం నుండి 09:05 గంటలకు ఫ్లైట్ ఉంటుంది. సాయంత్రం 04:45 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్తారు. అక్కడ మీరు కావాలనుకుంటే కాసేపు తిరగొచ్చు. షాపింగ్ చేయోచ్చు. డిన్నర్, రాత్రి హోటల్ లో బస చేస్తారు.

Day 2 : ఉదయం అల్పాహారం చేసి.. శంకరాచార్య ఆలయ దర్శనానికి వెళ్లాలి. దర్శనం తర్వాత, మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శన ఉంటుంది. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్‌బాల్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి. సూర్యాస్తమయం, ఫ్లోటింగ్ గార్డెన్స్ ఆనందించడానికి దాల్ సరస్సుపై షికారు చేయోచ్చు. అది కస్టమర్ స్వంత ఖర్చుతో ఉంటుంది. రాత్రి డిన్నర్ చేసి హోటల్ లో బస చేయాలి.

Day 3 : అల్పాహారం చేసి.. గుల్‌మార్గ్‌కు బయలుదేరాలి. రోడ్డు మార్గంలో వెళ్తారు. పచ్చికభూములు కనిపిస్తాయి. ఖిలన్‌మార్గ్ వరకు ఒక చిన్న ట్రెక్ కూడా ఉంటుంది. స్వంత ఖర్చుతో చేయాలి. కొన్ని ప్రదేశాలను చూపిస్తారు. తిరిగి శ్రీనగర్‌కు బయలుదేరుతారు. రాత్రి భోజనం, హోటల్‌లో బస చేయాలి. .

Day 4 : అల్పాహారం చేసిన తర్వాత.. కుంకుమపువ్వు తోటలు, అవంతిపుర శిథిలాల సందర్శన ఉంటుంది. మార్గంలో పహల్గామ్‌కు తీసుకెళ్తారు. పహల్గామ్‌లోని టూరిస్ట్ బస్ పార్కింగ్ వరకు తీసుకెళ్తారు. అక్కడ మీరు మీ స్వంత చెల్లింపుపై జీప్/పోనీ ద్వారా మినీ స్విట్జర్లాండ్/సమీప సందర్శనా స్థలాలను సందర్శించవచ్చు. తిరిగి శ్రీనగర్ చేరుకుని రాత్రి బస చేయాలి.

Day 5 : అల్పాహారం చేసి.. సోన్‌మార్గ్‌కు పూర్తి రోజు పర్యటన కోసం వెళ్లాలి. అక్కడ పలు ప్రదేశాలను చూపిస్తారు. వేసవి నెలల్లో ప్రధాన ఆకర్షణ అయిన థాజివాస్ గ్లేసియర్ వరకు వెళ్లడానికి పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రం శ్రీనగర్‌కు తిరిగి వెళ్లి.. రాత్రి హోటల్‌లోనే బస చేయాలి.

Day 6 : అల్పాహారం ముగించుకుని.. హోటల్ నుంచి చెక్అవుట్ చేయాలి. తర్వాత శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. మధ్యాహ్నం 03:15 గంటలకు ఫ్లైట్ ఉంటుంది. సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 07:50 గంటలకు విశాఖపట్నం బయలుదేరుతారు. 10:05 గంటలకు చేరుకుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

టికెట్ రేట్లు…

ఐఆర్‌సీటీసీ కశ్మీర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.39120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39910, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.49305 ధరగా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్ లో అందుబాటులో ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా ధరలు నిర్ణయించారు. కింద ఇచ్చిన జాబితాలో వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

టికెట్ ధరలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం