Nadav attacked The Kashmir Files again: ది కశ్మీర్‌ ఫైల్స్‌పై మరోసారి విరుచుకు పడిన నదావ్‌-nadav attacked the kashmir files movie again saying its very cruel and violent ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nadav Attacked The Kashmir Files Again: ది కశ్మీర్‌ ఫైల్స్‌పై మరోసారి విరుచుకు పడిన నదావ్‌

Nadav attacked The Kashmir Files again: ది కశ్మీర్‌ ఫైల్స్‌పై మరోసారి విరుచుకు పడిన నదావ్‌

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 09:16 PM IST

Nadav attacked The Kashmir Files again: ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీపై ఇజ్రాయెల్‌ ఫిల్మ్‌ మేకర్‌, ఇఫి జ్యూరీ హెడ్‌గా వ్యవహరించిన నదావ్‌ లాపిడ్‌ మరోసారి విరుచుకుపడ్డాడు. ఆ సినిమాను క్రూరమైనదిగా అభివర్ణించాడు.

నదావ్ లాపిడ్
నదావ్ లాపిడ్ (REUTERS)

Nadav attacked The Kashmir Files again: ది కశ్మర్‌ ఫైల్స్‌ మూవీపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేగిన దుమారం ఇంకా సద్దుమణగనే లేదు మరోసారి ఆ మూవీని టార్గెట్‌ చేశాడు ఇజ్రాయెల్‌ ఫిల్మ్‌ మేకర్‌ నదావ్‌ లాపిడ్. ఆ సినిమా నీచంగా ఉందని, దుష్ప్రచారం చేసినట్లుగా ఉందని ఇఫి ముగింపు సందర్భంగా నదావ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీలో నటించిన అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. నదావ్‌ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడే నీచమైన వ్యక్తి అని తీవ్రంగా స్పందించాడు. అయితే ఇన్ని విమర్శలు వచ్చినా నదావ్‌ వెనక్కి తగ్గకపోగా.. ఇప్పుడు మరోసారి ఆ సినిమాను విమర్శించాడు.

వివేక్‌ అగ్నిహోత్రి సినిమా క్రూరమైన, వాస్తవాలను తారుమారు చేసిన, హింసాత్మకమైనదిగా అభివర్ణించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. "చెత్త సినిమాలు తీయడం నేరం కాదు. కానీ ఈ సినిమా మాత్రం క్రూరంగా ఉంది. హింసాత్మకమైన, తప్పుదారి పట్టించి దుష్ప్రచారం చేసేలా ఉంది" అని నదావ్‌ అన్నాడు.

జ్యూరీ హెడ్‌గా తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నదని కూడా అతడు చెప్పాడు. "ఇలాంటి పరిస్థితే ఇజ్రాయెల్‌లో ఎదురైతే ఎవరైనా విదేశీ జ్యూరీ సభ్యుడు వచ్చి తాను చూసిన విషయాలను చూసినట్లుగా చెబితే నేను సంతోషిస్తా. నన్ను ఆహ్వానించిన చోట నా విధిగా ఇది చెప్పాలని నేను భావించాను" అని నదావ్‌ చెప్పాడు.

అంతేకాదు రాజకీయ ఒత్తిడి కారణంగానే ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీని ఇఫీ అధికారిక పోటీలోకి బలవంతంగా చొప్పించారని నదావ్‌ అనడం గమనార్హం. అక్కడి ప్రజలు చెప్పలేని విషయాన్ని తాను చెప్పినట్లు నదావ్‌ చెప్పాడు. "అలాంటి సందర్భాల్లో నేను సీక్రెట్లు, గుసగుసలను విశ్వసించను. స్టేజ్‌పై నిల్చొని మాట్లాడమని చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడతారు? మీరు చూసిన బీచ్‌లు, తిన్న భోజనం గురించి మాట్లాడతారా?" అంటూ ఇఫి వేదికపై తాను చేసిన కామెంట్స్‌ను సమర్థించుకున్నారు.

Whats_app_banner