The Kashmir Files: ‘కశ్మీర్ ఫైల్స్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడికి ఇజ్రాయెల్ రాయబారి చివాట్లు-the kashmir files you should be ashamed israeli envoy to filmmaker nadav lapid ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  The Kashmir Files You Should Be Ashamed Israeli Envoy To Filmmaker Nadav Lapid

The Kashmir Files: ‘కశ్మీర్ ఫైల్స్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడికి ఇజ్రాయెల్ రాయబారి చివాట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 29, 2022 03:12 PM IST

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఇఫి వేదికగా ఇజ్రాయెల్‍కు చెందిన ఓ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ దేశ రాయబారి స్పందించారు.

The Kashmir Files Row: భారత్‍కు క్షమాపణలు: ఇజ్రాయెల్ రాయబారి
The Kashmir Files Row: భారత్‍కు క్షమాపణలు: ఇజ్రాయెల్ రాయబారి

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI- ఇఫి) వేదికగా ఇజ్రాయెల్‍కు చెందిన ఓ డైరెక్టర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‍కు చెందిన నడావ్ లాపిడ్ (Nadav Lapid).. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‍లో జ్యూరీకి హెడ్‍గా ఉన్నారు. గోవా వేదికగా జరిగిన ‘ఇఫి’లో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించగా.. దానిపై లాపిడ్ వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర చిత్రమంటూ ఆయన మాట్లాడటంతో వివాదం తలెత్తింది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ స్పందించింది. ఇండియాలో ఆ దేశ రాయబారి నవోర్ గిలాన్ (Naor Gilor).. ట్విట్టర్ లో ఓపెన్ లెటర్ పోస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

సిగ్గుపడాలి

The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై లాపిడ్ వ్యాఖ్యలను ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. నడావ్ లాపిడ్‍కు ఓపెన్ లెటర్ అంటూ ట్వీట్లు చేశారు రాయబారి గిలాన్. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలకు మీరు (లాపిడ్) సిగ్గుపడాలంటూ చివాట్లు పెట్టారు. ఇందుకు సంబంధించి చాలా ట్వీట్లు పోస్ట్ చేశారు.

భారత్‍కు క్షమాపణ

The Kashmir Files: ఇఫి కార్యక్రమంలో ప్యానెల్ జడ్జీలకు హెడ్‍గా ఆహ్వానిస్తే ఇలాగేనా ప్రవర్తించేది అంటూ లాపిడ్‍ను సూటిగా ప్రశ్నించారు గిలాన్. భారత సంప్రదాయంలో అతిథిని దైవంగా భావిస్తారని, అలాంటి దేశానికి వచ్చి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. చారిత్రక విషయాల గురించి పూర్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అలాగే భారత్‍కు క్షమాపణలు తెలియజేస్తున్నామని గిలాన్ అన్నారు. ఈ వివాదానికి సంబంధించి ట్విట్టర్ లో ఆయన చాలా పోస్టులు చేశారు.

వివాదమేంటి..

The Kashmir Files: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) గోవాలో జరిగింది. ఈ కార్యక్రమం చివరి రోజున ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత ఇఫి కార్యక్రమం జ్యూరీ హెడ్‍గా ఉన్న నడావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం అసభ్యకరమైన సినిమా అని అన్నారు. ప్రచారం కోసం తీసినది అని చెప్పారు. దీంతో వివాదం మొదలైంది. లాపిడ్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది మార్చిలో కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైంది. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఇండియాలో ఘన విజయం సాధించింది.

WhatsApp channel

టాపిక్