SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు
03 May 2024, 16:41 IST
- South Central Railway Special Trains 2024 : సమ్మర్ లో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అలర్ట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ వివరాలను ఇక్కడ చూడండి......
సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
South Central Railway Special Trains 2024 Updates : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల(South Central Railway)ను ప్రకటించింది. ఏపీలోని తిరుపతి, కాకినాడ, మచిలీపట్నంతో పాటు బీదర్, యశ్వంతపూర్ కు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
వేసవి ప్రత్యేక రైళ్లు - వివరాలు
- సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు(ట్రైన్ నెంబర్ 07489)ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ సర్వీస్ మే 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. మే 13వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు మరో ట్రైన్ ఉంటుంది.
- మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ కు స్పెషల్ ట్రైన్(Special Trains) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మే 10వ తేదీన అందుబాటులో ఉంది.
- సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ మధ్య మే 11వ తేదీన స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. మే 13వ తేదీన కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
- యశ్వంతపూర్ నుంచి బీదర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ ట్రైన్ మే 6వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఇక బీదర్ నుంచి యశ్వంతపూర్ కు మే 7వ తేదీన స్పెషల్ ట్రైన్ నడవనుంది.
మరిన్ని ప్రత్యేక రైళ్లు….
- సికింద్రాబాద్-సాంత్రాగాఛి(07223)కి ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన ఈ సేవలు…. జూన్ 28 వరకు ఈ ట్రైన్ సేవలు ఉంటాయి. మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
- ప్రతి శనివారం సాంత్రాగాఛి నుంచి సికింద్రాబాద్(07224)కు ప్రత్యేక రైలు ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైన ఈ ట్రైన్…. జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్… తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ఈ సేవలు కొనసాగుతాయి.
- సికింద్రాబాద్-షాలిమార్(07225) మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది రైల్వేశాఖ. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ఈ ట్రైన్…. జూన్ 24 వరకు ఈ సేవలు కొనసాగుతాయి.
- ప్రతి సోమవారం షాలిమార్-సికింద్రాబాద్(07226) మధ్య మరోక్క స్పెషల్ ట్రైన్ సేవలు అందించనుంది. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైన ఈ సేవలు…. జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి.
- ఈ ప్రత్యేక రైళ్లు…. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.