Summer Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించడంతో...ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) సమ్మర్ స్పెషల్ ట్రైన్స్(Summer Special Trains) నడుపుతోంది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు అదనంగా నడుపుతుండగా.. వీటితో పాటు తిరుపతి-శ్రీకాకుళం(Tirupati-Srikakulam), కాచిగూడ-కాకినాడ(Kachiguda-Kakinada), హైదరాబాద్-నర్సాపురం(Hyderabad-Narsapur) మధ్య మరికొన్ని అదనపు రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నిర్దేశిత రోజుల్లో ప్రత్యేక రైళ్లు ట్రిప్పులు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం