Hill Stations: వేసవిలో ఎండలను తట్టుకోలేకపోతే ఈ హిల్ స్టేషన్లకు ఓ ట్రిప్ వేయండి, ఇవన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి-if you cant stand the summer sun then take a trip to these hill stations all located in south india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  If You Can't Stand The Summer Sun Then Take A Trip To These Hill Stations, All Located In South India

Hill Stations: వేసవిలో ఎండలను తట్టుకోలేకపోతే ఈ హిల్ స్టేషన్లకు ఓ ట్రిప్ వేయండి, ఇవన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి

Haritha Chappa HT Telugu
Mar 28, 2024 03:00 PM IST

Hill Stations: వేసవి సెలవులు వస్తే ఎక్కడికి వెళ్లాలని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎండ వేడి తాకని చోటుకు వెళ్లాలని అనుకుంటారు. అలాంటి చల్లని ప్రదేశాలు ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ దక్షిణ భారతం దేశంలో ఉన్నవే.

హిల్ స్టేషన్లు
హిల్ స్టేషన్లు (pixabay)

Hill Stations: చల్లని ప్రదేశంలో సహజ సౌందర్యాన్ని చూస్తూ... కొన్ని రోజులు గడిపితే మెదడు, శరీరం రిఫ్రెష్ అవుతాయి. వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్న వారు ఓసారి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్లపై ఓ లుక్ చేయండి. ఇవి చల్లగా ఉండడమే కాదు కనువిందుగా ఉంటాయి. సాంస్కృతిక వైవిధ్యాలను కలిగి ఉంటాయి. ఇక్కడికి వెళ్తే మళ్లీ తిరిగి రావాలని కూడా అనిపించదు. అంత అందంగా ఉంటాయి ఈ హిల్ స్టేషన్లలో.

ఊటీ

దీన్ని ఉదగమండలం అని పిలుస్తారు. ఇది ఒక అందమైన కొండపట్టణం. తమిళనాడులోని నీలగిరి కొండల మధ్యలో ఉంది ఇది. ఏడాది పొడవునా చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిండి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. వేసవి సెలవులు వస్తే ఎంతోమంది ఊటీకి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న సుసంపన్నమైన వృక్ష సంపద, కొండలు కళ్ళకు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉండే సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అందమైన గ్రామీణ ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడున్న బొటానికల్ గార్డెన్స్ లో అరుదైన ఆర్కిడ్లు, బోన్సాయి మొక్కలు... ఇలా ఎన్నో విదేశీ మొక్కలు అలరిస్తాయి. ఊటీ సరస్సు ఒడ్డున కూర్చుంటే అక్కడ నుంచి రావాలనిపించదు. పర్వతాలలో ట్రెక్కింగ్, క్యాంపింగ్, గుర్రపు స్వారీ వంటి ఎన్నో కాలక్షేపాలు సిద్ధంగా ఉంటాయి. ఊటీలో చేత్తో చేసిన చాక్లెట్లు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే. ఊటీని చూడడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి జూన్ నెల మధ్య. అక్కడ వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఊటీకి దగ్గరలో ఉన్న విమానాశ్రయం కోయంబత్తూర్. అదే సమీప రైల్వే స్టేషన్ మెట్టుపాళయం.

కూర్గ్

కర్ణాటకలో ఉన్న ఒక అందమైన ఊరు కూర్గ్. దీన్ని కొడగు అని కూడా పిలుస్తారు. జలపాతాలు, పొగ మంచు నిండిన పర్వతాలు, కాఫీ తోటలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న అబ్బే జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దట్టమైన వృక్షాలతో కూర్గ్ అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కాఫీ ఎస్టేట్లు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అతిథులను స్వాగతిస్తుంది. కూర్గ్‌లో అక్కి రోటి, పండి కూర వంటివి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ హైకింగ్, క్యాంపింగ్, రివర్ రాస్టింగ్ వంటివన్నీ చెయ్యొచ్చు. కూర్గ్ వెళ్ళేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మే నెలలోపు. దీనికి సమీపంలో ఉన్న విమానాశ్రయం మంగళూరు. ఇక రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నది మైసూరు. మైసూరు నుంచి కూర్గ్ కి బస్సు ద్వారా వెళ్లవచ్చు.

కొడైకెనాల్

తమిళనాడులో ఉన్న మరొక అందమైన హిల్ రిసార్ట్ కొడైకెనాల్. కొండలు, నిర్మలమైన సరస్సులతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొడైకెనాల్ సరస్సు మానవ నిర్మిత సరస్సు. అంటే మనుషులు చేతితో తవ్వడం ద్వారా ఏర్పడిన సరస్సు ఇది. కొడైకెనాల్‌లో ప్రధాన ఆకర్షణగా దీన్ని చెప్పుకుంటారు. ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం కొడైకెనాల్ నుంచి ఎక్కడికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. కొడైకెనాల్ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి జూన్ మధ్యకాలం. దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం మధురై. ఇక సమీప రైల్వే స్టేషన్ కూడా దగ్గర్లోనే ఉంది.

మున్నార్

కేరళలోని అందమైన పట్టణం మున్నార్. ఎంతోమంది తమ జీవితంలో ఒకసారైనా మున్నార్ వెళ్లాలని అనుకుంటారు. అక్కడ అందమైన ప్రాంతాలు, తేయాకు తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది సముద్ర ప్రాంతానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి బోటింగ్, ఫిషింగ్ వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టీ తోటలతో నిండిపోయి ఉంటుంది. మున్నార్ సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మే మధ్యలో సందర్శించవచ్చు. మున్నార్‌కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం కొచ్చి. ఇక సమీప రైల్వే స్టేషన్ కొచ్చి, ఎర్నాకులంలో ఉన్నాయి.

వాయనాడ్

కేరళలోని ఒక ప్రశాంతమైన కొండ పట్టణం వాయనాడ్. ఈ ప్రాంతం ఏడాది పొడవునా అందంగా ఉంటుంది. ఇక్కడున్న బాణాసుర సాగర్ డ్యాం... మనదేశంలోనే అతిపెద్ద మట్టి ఆనకట్ట. ఇక్కడ బోటింగ్, ఫిషింగ్ వంటివి చేయవచ్చు. శిల్పాలు, శాసనాలు, పురాతన గుహలు సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇక్కడున్న జూ చిరుత పులి, ఏనుగులు వంటి వాటితో నిండి ఉంటాయి. ఎన్నో అంతరించిపోతున్న మొక్కలకు ఇక్కడ కనిపిస్తాయి. వాయనాడ్ సందర్శించడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుండి మే నెల మధ్య. వాయనాడ్ వెళ్లాలంటే కోజికోడ్ రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి. అక్కడ నుంచి 110 కిలోమీటర్ల ఉంటుంది. దగ్గర్లో ఉన్న విమానాశ్రయం... కాలికట్ విమానాశ్రయం. అక్కడ నుంచి కారు లేదా బస్సులో ఈ నగరానికి చేరుకోవచ్చు.

ఏర్కాడ్

తమిళనాడులోని మరొక అందమైన హిల్ స్టేషన్ ఏర్కాడ్. ఇందులో కాఫీ పొలాలు, నారింజ తోటలు నిండుగా ఉంటాయి. ఏడాది పొడవునా ఇక్కడ ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడ్ సరస్సు చాలా అందంగా ఉంటుంది. దట్టమైన చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ బోటింగ్, క్రీడలు ఉంటాయి. ఇక్కడున్న కిల్లియుర్ జలపాతం ఏర్కాడ్‌కు వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఏర్కాడ్‌ను సందర్శించేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి జూన్ నెల మధ్యలో. ఏర్కాడ్‌కు వెళ్లాలంటే సేలం విమానాశ్రయానికి చేరుకోవాలి. లేదా రైలు ద్వారా సేలం జంక్షన్ కు వెళ్లాలి. అక్కడ నుంచి బస్సు మీద ఏర్కాడ్ చేరుకోవచ్చు.

కూనూర్

తమిళనాడులోనే ఉంది కూనూర్. తేయాకు తోటలతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది. సముద్రమట్టానికి 1850 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక్కడున్న బొటానికల్ పార్క్ కూనూర్ లోనే అత్యంత ఉత్తమ పర్యాటక ప్రదేశం. లోయలు, కొండలు ఇక్కడ అందంగా ఆకర్షిస్తాయి. కూనూర్‌కి వెళ్ళాలంటే దగ్గర్లో ఉన్న విమానాశ్రయం కోయంబత్తూర్. హిల్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ కూడా ఉంది

టాపిక్