Sankranti Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు-20 special trains for sankranti under south central railway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 20 ప్రత్యేక రైళ్లు

Sarath chandra.B HT Telugu
Dec 22, 2023 09:54 AM IST

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వీటిని నడుపనున్నారు.

సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains: సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు పలు ప్రాంతాలకు 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్ -తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

కాచిగూడ -కాకికనాడ టౌన్‌ స్పైషల్ ట్రైన్‌ (నంబర్ 07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

కాకినాడ టౌన్‌- కాచిగూడ ప్రత్యేక రైలు (నంబర్ 07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది.

హైదరాబాద్‌ -తిరుపతి ప్రత్యేక రైలు (నంబర్ 07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.

తిరుపతి - హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (నంబర్ 07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది.

కాచిగూడ-కాకినాడ టౌన్‌-కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నంబర్ .07653/07654) మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

హైదరాబాద్‌ -తిరుపతి- హైదరాబాద్‌ ప్రత్యేక రైళ్లు (రైలు నంబర్ 07509/07510) సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.