తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Nepal Tour : హైదరాబాద్ టూ నేపాల్ టూర్.. డిటేయిల్స్ ఇవే

IRCTC Nepal Tour : హైదరాబాద్ టూ నేపాల్ టూర్.. డిటేయిల్స్ ఇవే

Anand Sai HT Telugu

01 December 2022, 19:56 IST

    • IRCTC Royal Nepal Tour : నేపాల్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్
ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్

ఐఆర్‌సీటీసీ నేపాల్ టూర్

IRCTC New Package : ఐఆర్‌సీటీసీ ఇతర దేశాలకూ టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. తాజాగా రాయల్ నేపాల్ పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హిమాలయాల అందాలను చూడాలనుకునేవారికి ఇది మంచి ప్యాకేజీ. ఆరు రోజుల్లో నేపాల్(Nepal)లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించొచ్చు. 6 రోజులు, 5 రాత్రులు టూర్ ప్యాకేజీ ఇది. డిసెంబర్ 17న టూర్ ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో నేపాల్ లోని ఖాట్మండు(KATHMANDU), లుంబినీ(LUMBINI), పోఖారా(POKHARA) లాంటి ప్రాంతాలను సందర్శించొచ్చు.

Day 1: మెుదటి రోజు హైదరాబాద్(Hyderabad)లో టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుంది. 11:05 విమానం ఎక్కితే.. మధ్యాహ్నం 01:20కి గోరఖ్‌పూర్ చేరుకుంటారు. అక్కడ పికప్ చేసుకుని.. లుంబినీకి తీసుకెళ్తారు. 135 కిలో మీటర్లు వెళ్లాలి. World Peace Pagoda, మాయా దేవి ఆలయం, స్థానిక బౌద్ధ దేవాలయాలను సందర్శించాలి. హోటల్‌లో చెక్ ఇన్ చేసి.. భోజనం చేసి.., లుంబినీలో రాత్రిపూట బస చేస్తారు.

Day 2: ఉదయం టిఫిన్ చేసి.., చెక్ అవుట్ చేయాలి. పోఖారాకు బయలుదేరాలి. 210 కి.మీ ప్రయాణం ఉంటుంది. ఫేవా సరస్సును సందర్శించాలి. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ చేయాలి. పోఖారాలో రాత్రి బస చేస్తారు.

Day 3 : ఉదయాన్నే సూర్యోదయం కోసం సారంగ్‌కోట్ వ్యూ పాయింట్‌కు వెళ్లాలి. తరువాత బింధ్యబాసిని మందిర్, డేవిస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలను సందర్శించాలి. పోఖారాలోనే రాత్రి బస చేస్తారు.

Day 4: పోఖారలో అల్పాహారం చేసి.., చెక్ అవుట్ చేయాలి. 210 కి.మీ దూరంలో ఉన్న ఖాట్మాండుకు బయలుదేరాలి. మార్గంలో మనోకామ్నా ఆలయాన్ని సందర్శించాలి. ఆ తర్వాత హోటల్‌లో దిగాలి. స్థానిక మార్కెట్‌లో షాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. భోజనం చేసి రాత్రి ఖాట్మాండులో బస చేయాలి.

Day 5 : అల్పాహారం చేసి.. ఖాట్మాండులోని స్థానిక సందర్శనా స్థలాలకు వెళ్లాలి(పశుపతినాథ్ ఆలయం, దర్బార్ స్క్వేర్, రాయల్ ప్యాలెస్, స్వయంభూనాథ్ ఆలయం మొదలైనవి చూడొచ్చు). రాత్రిపూట ఖాట్మాండులోనే బస చేయాలి.

Day 6 : ఉదయం అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. 1:55 గంటలకు విమానం ఎక్కేందుకు ఖాట్మాండు విమానాశ్రయానికి బయలుదేరాలి. దీంతో టూర్ ముగుస్తుంది.

Royal Nepal Tour Package Price : ఐఆర్‌సీటీసీ రాయల్ నేపాల్ టూర్(IRCTC Royal Nepal Tour) ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర చూసుకుంటే.. రూ.40,755గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.41,990గా ఉంది. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.51,385గా నిర్ధారించారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతాయి. తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. నేపాల్ జారీ చేసిన గైడ్‌లైన్స్, ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం