తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandrababu In Balakrishna Unstoppable Season 2 Show Here Is Photos And Videos

Unstoppable season 2 : అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2.. బాలయ్య షోలో చంద్రబాబు, లోకేశ్

HT Telugu Desk HT Telugu

04 October 2022, 22:36 IST

    • Chandrababu In Balayya Talk Show : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీలో అన్​స్టాపబుల్ షో సక్సెస్ సాధించింది. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు గెస్ట్ గా వచ్చారు.
బాలయ్య షోలో చంద్రబాబు
బాలయ్య షోలో చంద్రబాబు

బాలయ్య షోలో చంద్రబాబు

బాలకృష్ణ హోస్ట్ గా అన్​స్టాపబుల్(Unstoppable) షో ఎంత సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఎప్పుడూ చూడని బాలయ్యను అభిమానులు చూశారు. కొత్తగా బాలకృష్ణ కనిపించారు. అన్ స్టాపబుల్ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో కొనసాగింపుగా మరో సీజన్ ప్రారంభిస్తున్నారు. అన్​స్టాపబుల్ సీజన్-2(Unstoppable Season 2) ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ షోకు చంద్రబాబు వచ్చారు. షుటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఈ షోతో బాలకృష్ణ(Balakrishna)లోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని చాలామంది అంటుంటారు. అన్​స్టాపబుల్ మెుదటి ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్‌గా వచ్చారు. చివరి ఎపిసోడ్‌కు మహేష్ బాబు గెస్ట్‌, మెుదటి సీజన్లో బాలకృష్ణ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. బాలయ్య ఇలా ఉంటారా అని అందరూ అనుకున్నారు. సీజన్ మొత్తం సందడిగా సాగింది. జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు సీజన్-2 గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సీజన్-2లో ఎవరెవరూ గెస్ట్‌లుగా వస్తారనే చర్చ కూడా నడుస్తోంది.

రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. బాలయ్య చంద్రబాబు మధ్య మాటలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ఎపిసోడ్ మధ్యలో లోకేష్ కూడా ఎంట్రీ ఇస్తారని సమాచారం. అల్లుడితో మామ ఎలా మాట్లాడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

అన్​స్టాపబుల్ సెట్ వద్ద బాలకృష్ణ(Balakrishna)తో చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అన్​స్టాపబుల్ సెట్‌లో బాలకృష్ణతో కలిసి చంద్రబాబు అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో తెగ షేర్ చేస్తున్నారు. ఇందులో అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం వినిపిస్తోంది. ఈ వీడియోలను టీడీపీ అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.