NTR Health University: సిగ్గులేని బతుకులు..! పేరు మార్పుపై బాలకృష్ణ సీరియస్-nandamuri balakrishna response on renaming ntr health university by ap govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nandamuri Balakrishna Response On Renaming Ntr Health University By Ap Govt

NTR Health University: సిగ్గులేని బతుకులు..! పేరు మార్పుపై బాలకృష్ణ సీరియస్

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 04:43 PM IST

ntr health university name change: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు.

ఏపీ సర్కార్ పై బాలయ్య ఫైర్
ఏపీ సర్కార్ పై బాలయ్య ఫైర్ (twitter)

nandamuri balakrishna on ntr health university: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు... హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం చుట్టే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఓవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా... నందమూరి కుటుంబం కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. శనివారం నందమూరి బాలకృష్ణ కూడా రియాక్ట్ అయ్యారు. ఫేస్ బుక్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్‌. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్‌ జాగ్రత్త. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ ’’ అని బాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు.

ntr health university name change issue: మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.ఓ దశలో వైఎస్ షర్మిల కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని పరోక్షంగా ఖండించారు. అయితే అధికార పార్టీ మాత్రం వారి నిర్ణయాన్ని బలంగా సమర్థించుకుంటోంది. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన వైఎస్ఆర్ పేరు పెట్టడమే సరైనదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై చంద్రబాబు స్పందిస్తూ... తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతామని స్పష్టం చేశారు. మొత్తంగా ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు... ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

WhatsApp channel