KCR National Politics : చంద్రబాబుతో కేసీఆర్ మళ్లీ దోస్తాన్.. నిజమేనా?-is kcr discuss about national politics with chandrababu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Is Kcr Discuss About National Politics With Chandrababu

KCR National Politics : చంద్రబాబుతో కేసీఆర్ మళ్లీ దోస్తాన్.. నిజమేనా?

Anand Sai HT Telugu
Oct 04, 2022 02:52 PM IST

KCR National Party : రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటుందో చెప్పలేం. ఏళ్లుగా ఉన్న వైరం కూడా ఒక్క నిర్ణయంతో మారిపోతుంది. జస్ట్ టెంపరరీ వార్ గా ముగిసిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం అదే చేస్తున్నారా? కారణం జగన్ అని అనుకోవచ్చా?

చంద్రబాబు కేసీఆర్(ఫైల్ ఫొటో)
చంద్రబాబు కేసీఆర్(ఫైల్ ఫొటో)

కొన్ని రోజులుగా గట్టిగా వినిపిస్తున్న మాట.. కేసీఆర్(KCR) జాతీయ రాజకీయాలు. ఉన్న అవకాశలన్నీ.. తన వైపు మారేలా కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. ఎలాంటి ఛాన్స్ దొరికినా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదనే మాట మరోసారి నిజమయ్యేలా కనిపిస్తుంది. కేవలం పార్టీల నిర్ణయాలతోనే.. మిత్రుత్వం కాస్త.. వైరంగా మారుతుందని ఇంకోసారి రుజువు కానుందా? మళ్లీ అవసరాన్ని బట్టి.. దగ్గర అవుతాం అనే మాటలు నిజం కానున్నాయా? ఈ ప్రశ్నలకు కారణం చంద్రబాబుతో కేసీఆర్ చర్చలు జరిపారనే ప్రచారం. అంతేకాదు.. ఇటీవల వైసీపీలో కీలక వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు కారణమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ(Telangana) ఏర్పండిది.. రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అటు ఏపీలో మెుదటిసారి టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండోసారి వైసీపీ గద్దెనెక్కింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు సఖ్యతగానే ఉన్నాయి. కాళేశ్వరంలాంటి ముఖ్యమైన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను పిలిచారు. కానీ కొన్ని రోజులుగా పరిస్థితులు మారాయి. బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాటల దాడి చేస్తుంటే.. జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. కానీ వైసీపీ మాత్రం.. సపోర్ట్ చేస్తూనే ఉంది. కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసే మోటర్లకు మీటర్ల అనే అంశంపై కేంద్ర నిర్ణయాన్ని వైసీపీ పాటించింది.

అయితే ఇలా బీజేపీ(BJP) నిర్ణయాలకు జగన్ మద్దతు తెలుపుతున్న సమయంలోనే.. మరోవైపు కేసీఆర్(KCR) జాతీయ రాజకీయాలంటూ తెరమీదకు వచ్చారు. ఇల్లు చక్కదిద్దుకోని బయటకు వెళ్దామంటే.. ఇటు జగన్ నిర్ణయాలు కేసీఆర్ కు కోపం తెప్పించేలా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దక్షిణ భారతంలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. అయితే ఇక్కడ నుంచి నరుక్కుంటూ వెళ్లాలంటే.. మరో తెలుగు రాష్ట్రం ఏపీ మాత్రం.. బీజేపీ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తోంది.

ఇలాంటి సమయంలో చంద్రబాబుతో కేసీఆర్(KCR) చర్చలు జరిపారనే.. వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YSRCP)ని దెబ్బకొట్టేందుకు ఈ అంశం ఉపయోగపడుతుందని టీడీపీ కూడా అనకుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలోనూ చంద్రబాబు(Chandrababu)కు జాతీయ రాజకీయాల్లో పని చేసిన అనుభవం ఉంది. థర్డ్ ఫ్రంట్ అంటూ.. దేశంలో పర్యటించారు. ఈ అనుభవం ప్లస్ తెలుగు రాష్ట్రం నుంచి మద్దతు అనే అంశం ప్రాతిపదికన చంద్రబాబుతో కేసీఆర్ చర్చలు జరిపారనే ప్రచారం ఊపందుకుంది. గతంలోనూ టీడీపీ-టీఆర్ఎస్(TDP TRS Alliance) కలిసి పనిచేశాయి. మళ్లీ కలిసి జాతీయ రాజకీయాల్లోకి ముందుకు వెళ్తే.. తప్పేంటి అనే ప్రశ్న వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఒకవేళ కేసీఆర్ జాతీయ పార్టీకి చంద్రబాబు మద్దతిస్తే.. అదే మద్దతుతో ఏపీలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్న వైసీపీని ఓడించాలని టీఆర్ఎస్ అనుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలకు చంద్రబాబు ఎంతో కొంత ఉపయోగపడతారనే అభిప్రాయం కేసీఆర్ కు ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏపీ తెలంగాణ మంత్రుల కామెంట్స్ చూసుకుంటే.. ఈ ప్రచారానికి ఇంకా బలం చేకూరినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt)లోని ముఖ్యమైన వ్యక్తి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడంతో హాట్ టాపిక్ మారింది.

'ఏపీ సీఎం జగన్‌(CM Jagan)లా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే ఏటా రూ.6 వేల కోట్లు అప్పులు తీసుకొని మరిన్ని పథకాలను ప్రవేశపెట్టేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తుంది.' అని వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. గతంలోనూ ఏపీలో విద్యుత్ సరఫరాపై హరీశ్‌ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తిరుపతి(Tirupati) వెళ్లినప్పుడు అక్కడ కొందరిని కలసి మాట్లాడానని చెప్పారు. కరెంట్ సరఫరా గురించి వాళ్లు అన్న మాటలు విన్న తర్వాత తెలంగాణ ఎంతో నయమనే విషయం తనకు అర్థమైందని వ్యాఖ్యానించారు.

అయితే తెలంగాణ నుంచి వచ్చిన కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. 'అవతల ఓ గ్యాంగ్ తయారై ఏపీ ప్రభుత్వం మీద, జగన్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూ కాకపోయినా హరీశ్ రావు ఎందుకు కామెంట్ చేశారు. అక్కడ క్యాంపు డైరెక్షన్ ప్రకారమే మాట్లాడుతున్నట్టుగా ఉంది. మేం ఎప్పుడూ కామెంట్ చేయలేదు. అధికారంలో ఉన్న వారు వాళ్ల సమస్యలు చూసుకోవాలి. మా పై ఎందుకు వ్యాఖ్యలు చేయాలి.' అని సజ్జల అన్నారు.

అయితే కిందటి ఎన్నికల్లో మెదీని ఓడించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత మోదీ అపాయింట్ మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు చంద్రబాబు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. బీజేపీ మీద కామెంట్స్ తగ్గిచ్చారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంపై చర్చలు జరిపితే.. మళ్లీ మోదీకి వ్యతిరేకంగా వెళ్తారా? లేదా? చూడాలి.

IPL_Entry_Point