Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. మరోసారి బాలయ్య సందడి షురూ-balakrishnas unstoppable season 2 trailer will release on 2022 october 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. మరోసారి బాలయ్య సందడి షురూ

Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. మరోసారి బాలయ్య సందడి షురూ

Unstoppable 2 Trailer: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి సీజన్ షురూ కానుంది. ఈ మేరకు అక్టోబరు 4న ఈ సీజన్ 2 ట్రైలర్ విడుదల చేయనున్నారు.

బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Twitter)

Unstoppable with NBK2: అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. 100 % లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబు ని అభిమానులకి చూపించబోతుంది. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. అందుకోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను రంగంలోకి దింపింది ఆహా.

జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన ప్రయాణం అన్ స్టాపబుల్ సీజన్‌ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా వారు ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు.

దర్శకులు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, "సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నాను, అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందుని ఆశిస్తున్నాను." అని స్పష్టం చేశారు.

సంబంధిత కథనం